పుట:పల్నాటి చరిత్ర.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పల్నాటి చరిత్ర

23


నరేంద్రునికాలమున కట్టబడినదని యందురు. అందు తిరుమల దేవరాయని కాలమునాటి శిధిలమగు శాసనము నాగుపాము బొమ్మగల రాతి స్తంభముమీద కలదు. ఆ గుడిలోనే ధ్వజ స్తంభమువద్ద శక 1470 (1548 A. D) లో గురిందలసీమ గురిందల (గురజాల) లో వీరభద్రునికి భూదానమిచ్చినట్లు శాసన మున్నది. దాని నకలిందు వ్రాయడమైనది.

ఆర్కాటునవాబు కొలువులోనున్న పోర్చుగీసు ఉద్యోగియొక్క యిద్దఱుపిల్లల సమాధులు యిష్టకామేశ్వరాలయము వద్దగల స్మశానములో కలవు.

పాతపాటమ్మగుడిలోని శాసనమువలన 1823 A. D. ప్రాంతమున గుంటూరు జిల్లా కలెక్టరు ఓక్సుదొర పాతపాటమ్మ గుడికి ఈనాము యిచ్చినట్లు తెలియుచున్నది.

గురజాల వీరభద్రస్వామి యాలయములో ధ్వజస్తంభము వెంబడిగల శాసనము. స్వస్తిశ్రీ జయాభుద్యయ శరవర్షంబులు 1470 (1548 A.D.) అగు ...... సంవత్సర నందరాజు రామయ దేవ మహారాజులుంగారు ....... గురిందల గురిఁదలసీమ.... దేవబ్రాహ్మణుల కిచ్చిన ధర్మం ....మాన్యంగాను సమర్పిస్తిమిగాన...చంద్రార్కంగాను అనుభవించు...

రామయదేవుడనగా విజయనగరరాజ్యమేలిన రామరాజు.

ఈ వీరభద్రాలయ శిఖరమును ఇటీవల ప్రఖ్యాత నటకుడును న్యాయవాదియునగు కీర్తిశేషులగు బెల్లంకొండ సుబ్బారావుగారు బాగుచేయించిరి