పుట:పల్నాటి చరిత్ర.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పల్నాటి చరిత్ర

25

శాసనము శక 1410 (1518 A. D.) నాటిది శ్రీకృష్ణదేవరాయలు పట్లవీడుశివారు రామడకను మాచెర్ల చెన్నకేశవునికిచ్చినట్లు శాసనము. (ఈ ప్రాంతమును గెలిచిన రెండు సంవత్సరములకు)

పట్లవీడు వద్దగల కృష్ణదేవరాయని శాసనము.

స్వస్తిశ్రీ విజయాభ్యుదయ శాలివాహన శక వర్షంబులు కృష్ణవర సంగడు 1440 (A.D 1518) బహుధాన్యనామ సం॥ వైశాఖ శు 15 మహారాజశ్రీ రాజాధిరాజ మహీవర శ్రీ వీర ప్రతాప కృష్ణరాయలు వృధివీరాజ్యం శాయంగాను యల్లవినాయంకరు మక్బకా తిమ్మరు నాయంకరు మాచెర్ల చెన్నకేశవదేవరి అమృతపడి నయివేద్య అంగరంగ వైభవానకుమనిరి భూదాన ధర్మశాసనపత్రం క్రిష్ణరాయ మహారాయ నాయంకరు నాగార్జునకొండసీమ రామడక గ్రామానువారిరాగ ... పుణ్యకాలమున క్రిష్ణవేణి తిరుణోత్సవవర్త ఏక్వనాధ సన్నిధియలు దానము పూర్వకముగా కృష్ణరాయ మహారాయనికి పుణ్యంగాను ధారపోసి సమర్పిస్తిమి. ఆగ్రామ మందలి చతురుమూలలం దాననిత్యాపజలవాహిని అందు మాచర్ల చెన్నకేశవదేవర అమృతపడి సయితం అంగరంగ వయిభవ గ్రామముకొండ ఆచంద్రార్క స్తాయిగాను స్వామి మాచర్ల చెన్నకేశవదేవ చదివించి నైవైద్య అంగరంగవయిభవము మల్లప్పనాయంకరు తిమ్మనాయంకరు అనుభవించేది. తిమ్మప్పనాయంకరు సమర్పించింది స్వదత్తాద్విగుణం పుణ్యం...