పుట:పల్నాటి చరిత్ర.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పల్నాటి చరిత్ర

19

కాలమునాటి దాసశాసనము కలదు.

బుగ్గకుత్తరముగా మూడు మైళ్ల దూరమునగల గుడిలో రెండవప్రతాపరుద్రుని కాలమునాటి శక 1240 (1318 A D.). శాసనము కలదు.

చింతపల్లి:- రెండవ ప్రతాపరుద్రుని కాలమునాటి దానశాసనములు రెండు శక 1224 (A.D 1302) నాటిది శక 1226 (1304 A.D) నాటిది శివాలయములోని యొక రాతిపైన నిరువైపుల కలవు. శక 1674 (1752 A. D.) నాటిది హనుమంతునిగుడి కట్టబడినట్లు యొక శాసనము కలదు.

దాచేపల్లి : 14 వ శతాబ్దమున కొండవీటి రెడ్డిరాజు లచే కట్టబడినదని చెప్పబడు పాడుబడిన కోటగలదు. కల్యాణ మంటపమునకు దగ్గరగానున్న యొక రాతిపైన (నాగేశ్వరస్వామిగుడిలో) త్రిపురాంతక దేవుని ప్రధాన మంత్రియొక్క కుమారులచే చేయబడిన దానశాసనము శక 1135 (1213A.D.) నాటిది కలదు.

శక 1177 (1255 A.D) నాటిశాసన మొక రాతి స్తంభముమీద కలదు. రెండవ ప్రతాపరుద్రుని మంత్రి నువ్వులమంచిరాజు గ్రామపుశిస్తులను దేవాలయమునకు దానము చేసెను. కృష్ణ దేవరాయల కాలములో శక 1440 (A. D.1518 ) (అనగా రాయలీ ప్రాంతమును గెలిచిన రెండు సంవత్సరములకు) నాటి దానశాసనము నందిమండపమునకు దక్షిణముగానున్న రాతిమీద కలదు.