పుట:పల్నాటి చరిత్ర.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

18

పల్నాటి చరిత్ర

మాచర్ల తాలూకా ఆఫీసుకుత్తరముగా వాగుయొడ్డున పొలములో నిలువుగా పాతిన యెఱ్ఱరాతిమీది శాసనము.

“శక 1448 అగు నేటి వ్యయసం॥ క్రిష్ణ రాయదేవ మహా రాజులు పృధ్వీరాజ్యం చేయుచుండంగాను... కార్యకర్తలైన కూనమనాయని కుమారుడు కోనపనాయనింగారు నాగార్జున కొండసీమలోని మాచర్లను వూరితూర్పున....ముత్తినేని తొండడు యిష్టకామేశ్వరునికి వీరేశ్వరునికి అమృతపడి కూర గాయలు పూజపుష్పాలకు త్రియంబక... గాను ధారాపూర్వ కంగా సమర్పిస్తిమి.” ఇది 1526 A.D. లో కృష్ణ దేవరాయల కాలమునాటి శాసనము.

సింగరుట్ల:-సింగరుట్ల అడవిలో శక 1240 (A D. 1318) నాటి శాసనము కలదు.

దుర్గి :- గోపాలస్వామి గుడి యుత్తర ప్రాకారమువద్ద రాతిమీద 1219 (1297 A.D.) రెండవ ప్రతాపరుద్రుని కాలమునాటి దానశాసనము కలదు.

వరంగల్లు సామ్రాజ్యమునకు రుద్రమదేవి రాణిగా నుండి ఈ ప్రాంతమున జన్నిగదేవరాజు గవర్నరుగనుండిన శక 1191 (1269 A. D.) శుక్లనామ సంవత్సమునాటి శాసనము. పైశాసనమునకు దగ్గరగనే యొక పెద్ద రాతిమీద కలదు. వెంకటేశ్వరస్వామివారి యాలయములోని స్తంభము పైన శక 1180 (A.D. 1258) నాటి కాకతీయ గణపతిదేవుని కాలమునాటి దానశాసనము కలదు.