పుట:పల్నాటి చరిత్ర.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పల్నాటి చరిత్ర

17

ఆలింగాపురాన నలుదరి పొలాలు హేమకూప తటాక నిధి నిక్షేప జలపాషాణ ఆగామిసిద్ధి సాధ్యాలు అనెడి అష్టభోగ తేజస్వామ్యాలు సమర్పిస్తిమిగాన ఆలింగాపురమందుల పొలము ఆచంద్రార్కస్థాయిగాను అంగరంగ వైభవాలకు అవధరించి ఆగ్రామదేవరకు ఎవ్వరు ఇయ్యకపోయినా గంగా గర్భమందు గోబ్రాహ్మణ హత్యచేసిన పాపానపోతారు. వారణాసిలో తలిదండ్రుల జంపిన పాపానపోతారు.

శ్లో. ఏకైవ భగినీలోకే ఏషామేవ భూభుజాం
    నభోగ్యా నకరగ్రాహ్యా దేవదత్తా వసుంధరా

“క్షేత్రము పాలిచ్చుటయనగా యాపొలమును వ్యవసాయము చేయుటకు కావలసిన విత్తనములు కావచ్చును.

ఇది మాచర్ల డి. నె. 792రు 1216 యకరముల 6 సెంట్లు. ఈ శాసనము ననుసరించి ఆదేశాలను కైంకర్యమునకు యిప్ప టికీని వినియోగపడుచున్నది"

మాచర్లకు తూర్పున చంద్రవంకవెంబడి పడమరను జనరల్ రోడ్డు వంతెనకు వాయవ్యమున పాడుపడినగుడి వెంబడియున్న శాసనము.

"కాకతీయ ప్రతాపరుద్రదేవ మహారాజులు సుఖముగా వినోదంబున పృధివీరాజ్యం చేయుచుండంగాను... శక 1236 (1314 A.D) అగు ఆనంద.... మాచమనాయనింగారి.... దేవరనాయనింగారు మహాదేవి చెఱు సుఖాన పాలించుచు తమకు పుణ్యముకుగాను ధారాపూర్వకముగా సమర్పిస్తిమి."

ఇతడు రెండవ ప్రతాపరుద్రుడు. Wonders