పుట:పల్నాటి చరిత్ర.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

16

పల్నాటి చరిత్ర

పోలికగా నుండదు. ఈ యాదిత్యేశ్వరాలయము చెన్నకేశవాలయ ప్రాకారములో నున్నది. దీని నిటీవల కర్నాటి హనుమంతు యను వైశ్యుడు బాగు చేయించెను.

మాచెర్ల వీరభద్రాలయములో తూర్పువైపున నున్న యెఱ్ఱరాతిబండమీది శాసనము.

స్వస్తిశ్రీ విజయాభ్యుదయ శాలివాహనశక వర్షంబులు (శక 1476_1554 A. D.) నిజ ఆనంద సంవత్సరములు మాచర్ల యిష్టకామేశ్వరికిన్ని వీరభద్రేశ్వరునకున్ను గాయిగోవాన ఖడ్గనారాయణ బిరుదాంకిత ప్రశస్తులై శ్వేతచ్ఛత్రాధీశ్వర రేచెర్ల గోత్ర పవిత్రులైన వెలిగోటి...... మనాయనింగారి ప్రపౌత్రులై

తిమ్మానాయానింగారి పౌత్రులై బ... నాయనిగారి పుత్రులైన కొమారి తిమ్మానాయనింగారి అర్ధాంగి లింగాంబ దండబెట్టిం యిచ్చిన శాసనము.

శ్రీమద్రాజ మార్తాండరాజ పరమేశ్వర శ్రీవీరప్రతాప సదాశివరాయదేవ మహారాజులుంగారు పృధ్వీరాజ్యం చేయుచుండంగాను శ్రీమన్మహామండలేశ్వర రామరాజు తిరుమల జయదేవమహారాజులుంగారు కుమార తిమ్మానాయనింగారి నాయంకరానకు పాలించి యిచ్చిన నాగార్జున కొండ సీమలోని మాచెర్లకు ఉత్తరభాగాన చంద్రభాగానదికి పడమర సం॥ కి 45 నాలుపుట్ల పందుం క్షేత్రముపాలిచ్చే లింగాపురమనెడి అగ్రహారము కట్టించి యీ సోమగ్రహణ పుణ్యకాలమందుల గంగాగర్భమందుల ధారాపూర్వకంగాను సమర్పిస్తిమి గనుక