పుట:పల్నాటి చరిత్ర.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పల్నాటి చరిత్ర

15

భాగానది యనగా చంద్రవంక, నాగేశ్వరనది యనగా నాగులేరు. నాగులేటికి తూర్పునగల సబ్బెయపల్లి (ఆగ్రామమిప్పుడు లేదు) యను గ్రామములోను ఆతుకూరిగ్రామములోను కంభముపాడు గ్రామములోను కొంతభూమిని శ్రీధరునికుమారుడగు నొకయాదిత్యునిచే (చాళుక్యవంశపు రాజులకు ఆదిత్యయను బిరుదు పేరునకు చివర యుండును. అట్టిరాజులలోనొకడు) నిర్మింపబడిన శివాలయమునకు, చాగిబేతరాజనువాడు భూదా నము చేసినట్లున్నది. కార్తవీర్యునివంశములో పుట్టిన చాగిబేతరాజు అతనిపుత్రుడు - అనుంగుగాముడు-అతనిపుత్రుడు- కామనృపుడు (వీరకాముడు) — అతని కుమారుడు బేతరాజు భూదానము చేసినట్లున్నది. పల్నాటి వీరచరిత్రలోని అలుగురాజు (ఇతనికి అనుగురాజు అను నామాంతరముకలదు) యొక్క తండ్రి పేరు వీర కామేంద్రుడని ఉమాకాంతముగారి పీఠికలో నున్నది.

అలుగురాజు కుమారుడగు నలగామరాజును వీర కామేంద్రుడని శ్రీనాధుడు వాడినాడు. తాత పేరు మనుమనికి పెట్టు ఆచారమున్నది. కావున ఈ చాగి బేతరాజే పల్నాటి వీర చరిత్రలోని అనుగురాజై యుండును. నివర్తనపరిమితమనగా యి ప్ప టి యకరములవలె భూమికొలత మానమై యుండును. కన్నడ నాగిమయ్య కన్నడదేశస్థుడైయుండును. శాసనపు లిపికూడి కన్నడ లిపిని బోలియున్నది. ఈ శాసనమునకు పిమ్మట రమారమి 70 సంవత్సరములకు పల్నాటియుద్ధము జరిగినది. దీనిలిపి తెలుగేయైనను 12 వ శతాబ్దపులిపికావున యిప్పటి అక్షరముల