పుట:పల్నాటి చరిత్ర.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

20

పల్నాటి చరిత్ర

ముఖమంటపమునకు బయట చిన్న రాతిమీద కాకతీయ రెండవ ప్రతాపరుద్రునినాటి శక 1219 (1297 A.D.) నాటి శాసనము కలదు. అదే ముఖమంటపముయొక్క పెద్ద రాతిపైన కాకతీయ గణపతిదేవుని గవర్నరగు గంగయ్యచే చేయబడిన దానశాసనము శక 1173 (A.D. 1251) విరోధి కృతు నాటిది కలదు.

ఊరిమధ్య దేవాలయములో రెండవ ప్రతాపరుద్రుని యుద్యోగస్తుడు శక 1219 (1297 A D.) హేవిళంబి సం॥ లో నిచ్చిన దానశాసనము. రుద్రమదేవి కాలములో శక 1191] (1269 A.D.)న నొక కరణమిచ్చిన దానశాసన మొకటి. గణపతి దేవునికాలములో శక 1180 (A D. 1258) కాళయుక్తి నాటి దానశాసనమును శశ 1179 (1259 A D.) పింగళ సం॥ దానశాసనములును కలవు.

గోలి:- గోలినుండి త్రవ్వబడిన బౌద్ధశిలా ఫలకములలో వెస్సంతరునికధ చెన్నపురి చిత్రవస్తు కళాశాలలో నున్నది. వెస్సంతరుడనగా బుద్ధుని పూర్వజన్మలలో నొకడుగు వైశ్య కుమారుడు, దానశీలుడు. తనకున్న సర్వస్వము నేకాక తుదకు తన భార్యను కూడ దానమిచ్చెను.

కొండవీటి రాజ్యములో నాగార్జునకొండ సీమలో 150 గ్రామములు.
సముతు గ్రామముల సంఖ్య సీమపెత్తనదారు
మాచెర్ల 64 సూరపరాజువారు