పుట:పల్నాటి చరిత్ర.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

10

పల్నాటి చరిత్ర


అనుబంధము 3

.

పల్నాటిలోని కొన్ని శాసనములు.

మాచర్ల:- 1. చెన్నకేశవాలయములో శ క 1033 (A. D. IIII) శాసనము, ఇదిచాల ప్రాచీనమైనది. ఆదిత్యే శ్వరాలయమునకు చాగి చేతరాజు భూదానమిచ్చినట్లు శాసనము, దీనినకలిందు వ్రాయబడినది.

2. చంద్రవంకయొడ్డున జనరలు రోడ్డు వంతెననానుకొని వాగుకు పడమరగాను రోడ్డుకు మత్తరముగానున్న రెండవ ప్రతాపరుద్రువినాటి శక 1236 (1314 A. D) వాటి దాన శాసనము. దీనినకలిందు వ్రాయడమైనది.

3. వీరభద్రాలయములోని యెఱబండ శాసనము (Ā. D. 1554 నాటిది). ఇది విజయనగర సామ్రాజ్యమునాటిది, లింగాపురమను గ్రామము వీరభద్రస్వామికిచ్చిన శాసనము. దీనినకలిందు వ్రాయబడినది.

4. చంద్రవంకయొడ్డున చింతల రామస్వామి గుడిలోని శక 1710 (1788 A. D.) కీలక ఫాల్గుణ శు 15 నాటి శాస నము. దీనివలన పల్నాటిలో మాచర్లసీమ , గురజాలసీమ , తుమృకోటసీమ, కారెంపూడిసీమ , తంగెడసీమయను యయిదు భాగములుండినట్లు తెలియుచున్నది

5. చెన్న కేశవాలయములో శిధిలమయిన భాగమును బాగుచేయించినట్లు శ.క 1310 (AD 1397) నాటిది ముఖ