పుట:పల్నాటి చరిత్ర.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పల్నాటి చరిత్ర

11

ముఖమంటప స్తంభముమీద కలదు. శశ 1541 (A. D.1619) నాటి దానశాసనముకూడ నా స్తంభమునందే కలదు.

6. మాచర్ల ముటుకూరు మధ్య శక 1171 (A. D. 1249) నాటి శాసనముకలదు.

7. గరుడ స్తంభముమీద శ క 1566 (1644 A.D.) తో స్తంభము నిర్మించినట్లు శాసనము.

8. పోలేరమ్మ గుడివద్దగల నొక రాతి మీద శక 1215 (1293 AD.)న రెండవ ప్రతాపరుద్రుని కాలమున నిచ్ఛిన దానశాసనము.

9. తాలూకా ఆఫీసుకు వెనుకవైపున వాగుయొడ్డున పొలములో శక 1448 (1526 A.D.) కృష్ణ దేవరాయలు మాచర్ల వీరభద్రస్వామికి యిష్టకామేశ్వరికి యిచ్చినభూదాన శాసనము. దీనినిక లిందువ్రాయడమైనది.

10. శ క 1592 సౌమ్య కార్తీక శు 15 (1670 A.D.) గోల్కొండనవాబగు అబ్దుల్లాపాదుషా (ఇతనితరువాత తానీషా యేలెను) కాలపుశాసనము మాచెర్ల చెరువుకట్టమీద కలదు.

మాచర్ల చెన్నకేశవాలయములో నాగుపాముగల

రాతిస్తంభముమీది శాసనము.

1. శ్రీలక్ష్మీంద్విజపతిధారిణం వృషాంకం చక్రిణం సతతము 2. మాంత్రిమార్గగాంచ। ఆదిత్యం శ్రుతినయనాత్తభూష 3. మవ్యాడ్భూతేశః స్వయమితి భూరిమన్యమానః|| 4. శ్రియామేకం పాత్రం నిరుపమమహామన్మధ ఇవద్వితీయం