పుట:పల్నాటి చరిత్ర.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పల్నాటి చరిత్ర

9

9. దండంరాజు కేశవరావు:- పిడుగురాళ్ల నివాసి. నియోగిబ్రాహ్మణుడు. సన్యసించి స్వామి కేశవతీర్ధయను నామ రామదర్శినియను మాసపత్రికను నడుపుచు ననేక యధ్యాత్మిక గ్రంధములు రచించిరి. తులసీదాసు రామాయణమును తెలుగున పద్యకావ్యముగా వ్రాయుచున్నారు

10. వేదాంతెము శేషాచారి:- ముటుకూరు, నెమలిపురిలో నుందురు, వైష్ణవుడు, మాఘపురాణము, రామరాఘవ శతకము సూర్యనారాయణ శతకమును రచించెను.

11. తంగెడ నారాయణరావు:- తంగెడనివాసి. బ్రాహ్మణుడు, నియోగి. వరూధిని నాటకమును రచించెను.

12. కూరపాటి కోటమరాజు:- నాగులవరము నివాసి. భట్రాజు. యల్లమందకోటీశ్వర శతకమును రచించెను.

18. శీతిరాజు రామచంద్రయ్య:- వెల్దుర్తినివాసి నియోగి సత్యనారాయణ వ్రతమును పద్యకావ్యముగా రచించెను.

14. కొండ రాజమల్లయాచారి:- వేమవరనివాసి. విశ్వ బ్రాహ్మణుడు. నలనాటకము యక్షగానముగా రచించెను.

15. రెంటాల వేంకటసీతారామయ్య:- రెంటాల నివాసి, బ్రాహ్మణుడు. నందవరీకి. ఆదిశంకరుడు సంస్కృతమున రచించిన సౌందర్యలహరిని పద్యములుగా తెలుగున రచించెను.

అక్కిరాజు చంద్రమౌళి నిత్యానందముగారు మొదలగు