పుట:పల్నాటి చరిత్ర.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పల్నాటి చరిత్ర

అనుబంధము 2

.

పల్నాటిలోని కీర్తిశేషులైన యిటీవలికవులు

1. పాటిబండ గురుమూర్తి :- మాచర్ల నివాసి బ్రాహ్మణుడు నియోగి. ఋష్యశృంగోపాఖ్యానమను ప్రబంధము క్రీ. శ. 1879 న రచించి మాచర్ల వీరభద్రస్వామి కంకితమిచ్చెను. తన గ్రంధమున 'పల్లెనాటిసీమ' యనివాడెను. కొండవీటి సీమలోని పాటిబండ యితని గ్రామము

2. విద్యాశేఖర అక్కిరాజు ఉమాకాంతము గారు:- గుత్తికొండనివాసి, బ్రాహ్మణుడు , నియోగి, చెన్నపురి ప్రెసిడెన్నీ కాలేజీలో నాంధ్రాధ్యాపకుడుగా నుండెను. పల్నాటి వీర చరిత్ర కధలు, షేక్సుపియరు నాటకకధలు, టిప్పుసుల్తాను (నవల), నేటికాలపు కవిత్వము మొదలగునవి రచించుటేగాక శ్రీనాధుడు రచించిన వీరచరిత్రలో బాలచంద్రుని యుద్ధభాగమును అచ్చొత్తించి యుద్ధకాలమును నిర్ణయించుచు విపుల మగు పీఠిక వ్రాసిరి.

3. జానపాటి పట్టాభిరామశాస్త్రిగారు:- జానపాటినివాసి. వైదికుడు బ్రాహ్మణుడు. అభినవసరస్వతియను పత్రిక నడపెను. నాగరఖండము, స్వర్ణకార వ్యవహార మను పద్యకావ్యముల రచించెను.

4. కన్నెగంటి ప్రభులింగాచార్యులు: తక్కెళ్లపాటి నివాసి. విశ్వబ్రాహ్మణుడు. అష్టావధాని. పల్నాటి వీరచరిత్ర నాటకము జయప్రద నాటకము నీలకంఠేశ్వర శతకము, పోతన చరిత్రేయరు పద్యకావ్యము మున్నగు గ్రంధములు రచించెను '