పుట:పల్నాటి చరిత్ర.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

6

పల్నాటి చరిత్ర

5. సూరపరాజు వేంకటరమణయ్య:- మాచర్ల నివాసి. బ్రాహ్మణుడు యాజ్ఞవల్కుడు,భైష్మీపరిణయమును, తారా శశాంక నాటకము వ్రాసెను.

6. పిన్నెలి నాగయ్య:- గురజాల నివాసి, బ్రాహ్మణుడు వైదికుడు. సుకన్యకాపరిణయమను గ్రంధమును రచించెను.

7. తిరునగరి వేంకట నరససూరి:- గంగవర నివాసి. సాతాని, రామదేవశతకమును రచించెను.

8. తంగెడ రామకృష్ణయ్య:- మోర్జంపాడు నివాసి బ్రాహ్మణుడు నియోగి. గౌరీపరిణయము, శివానందలహరి యాంధ్రీకరణమును రచించెను.

9. తంగెడ నరిసింహారావు:- మోర్జంపాడు నివాసి బ్రాహ్మణులు నియోగి. దీక్షితస్తుతి రచించెను.

10. తంగెడ లక్ష్మీకాంతకవి:- మోటంపాడు నివాసి, బ్రాహ్మణుడు నియోగి. సముద్ర మథనము బుఱ్ఱుకధ, జగన్మోహిని నాటకము యక్షగానము రచించెను.

11, గోలి కమలనాభుడు:- దాచేపల్లి నివాసి. కళావంతుడు. అంబరీషోపాఖ్యానము (పద్యకావ్యము) రచించెను.

12. దుర్గరాజు నరసయ్య పాకయాజి: గురజాలనివాసి, బ్రాహ్మణుడు నియోగి. భాగవతమును కందార్థ సీసములుగా రచించెను. పెద్దది. అముద్రితము.

13 సరికొండ లక్ష్మీనరసింహకవి:- నాగులవరనివాసి భట్రాజు. తిరుపతి వేంకటేశ్వర శతకమును, బెజవాడ కనకదుర్గ శతకమురు రచించెను.