పుట:పల్నాటి చరిత్ర.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4

పల్నాటి చరిత్ర

(నలగాముని సైన్యమునకు హద్దులు)



[1]జువ్వలకల్లను సొగసైనపల్లె
సన్నెగండ్ల యనంగ జవరనియూరు
తూరుపు దిక్కుకు తుది మేరసుమ్ము
దక్షిణదిశహద్దు దగవివరింతు
నాగులేటికి తూర్పు నలగొండకాని
చెలువైన యా వప్పిచర్ల జెలంగు
పడమటికిని హద్దు బాలచంద్రుండ
కొదమగుండ్లయనెడు గురిగ్రామ మొకటి
ప్రజలమేలిమి చింతపల్లియునొకటి
ఉత్తరదిశ యెల్ల లొయ్యనగాంచు

(నలగాముని సైన్యములోని కొందరు వీరులు)



పొందుగులనేలు భూరి విక్రముడు
వీరమల్లనునట్టి విఖ్యాతుడొకడు
[2]విక్రమసింహంబు వీరకామేంద్రుండు

(బాలచంద్రుని పుట్టుక సందర్భమున)



వైకుంఠ శృంగార వనములోపలను
చెన్నారు అనిమ్మ చెట్టున కేగి
పలకల బావిలోపల నీరు ముంచి
చనిజమ్మి వృక్షంపు సవ్యభాగమున


  1. జూలకల్లు
  2. నలగామరాజు