పుట:పల్నాటి చరిత్ర.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పల్నాటి చరిత్ర

3

సూర్యకుమారాఖ్య చోళ రాజునకును
సుగ్రామ విజయుడౌ జయదేవునకును
జయసింగ నృపతికి చంద్రాధిపతికి
ప్రాథవాఢ్యుడు వీరభల్లాణునకును

§§§§ §§§§ §§§§ §§§§ §§§§

నగరంబు వెల్వడి నలగామరాజు
దక్షిణదిశయందు దనరెడి బయలు
[1]దూబచెర్వనేడు నుత్తుంగభూస్తలిని
నిలిపించే గజములు నిండినవేడ్క
కాశికి సమమైన కార్యమపూడి
రణరుగభూమిని రాజుదానిల్చె
లవిమీఱ వీరభల్లాణుండువచ్చె
నొక వేయి యశ్వాల నొనర ప్రతాప
[2]రుద్రుడు పంపించె రూఢ సంగతిని
ఇరువది వేలతో నేతెంచెనొడ్డె
[3]భువినేలు బలదేవ పురుషోత్తముండు
గుండమదేవుండు గొబ్బూరిరాజు
పద్మసేనుండును పరువిడివచ్చె


  1. ఈదూబచెరువిప్పటికి గురజాలలో నున్నది.

  2. వరంగల్లునేలు కాకతీయ చక్రవర్తి మొదటి ప్రతాపరుద్రుడు.
  3. ఓఢ్రదేశమునేలు గజపతి