పుట:పల్నాటి చరిత్ర.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పల్నాటి చరిత్ర

53

బ్రాహ్మణుడు. యుద్ధమునందు విక్రమచోడరాజును గెలిచెను. పింగళియనగా పిన్నెలియగుటచే (23, 24 పుటలు చూడుము) నితడు పల్నాటిలోని పిన్నెలికి చెందినవాడు. తన పూర్వులగు పింగళివారు శాఖలుగా చీలి కృష్ణా గోదావరి మండలములందును, పలనాటను పాకనాటను ప్రసిద్ధులైనట్లు పింగళి సూరన వ్రాసెను.

3. పింగళి మాదయ్య..ఇతను క్రీ.శ. 17 వ శతాబ్దము వాడు. క్రీ.శ. 1672 నుండి 1687 వఱకు గోల్కండ రాజ్య మేలిన కుతుబ్ అబుల్ హసన్ (తానీషా) కు ప్రధాన మంత్రి. ఈ తానీషా కాలముననే గోలకొండ రాజ్య మంతరించెను . ఇతనికాలముకనే రామదాసుకథ జరిగెను, తానీషా పేర నిజమునితడే గోల్కొండ రాజ్యమేలెను. వరుసకు తమ్ముడగు అక్కన్నను సేనాపతిగా నియమించు కొనెను. బందరులోనుండిన యాంగ్లేయులు యితనికి నజరానా చెల్లించి దయ సంపాదించి గోలకొండనవాబగు తానీషానుండి రూపాయి నాణెముల ముద్రించుటకు నధికారమును బొందిరి. ఇతడును పల్నాటిలోని పింగళి (పిన్నెలి) కి చెందినవాడు. ఈముగ్గురి వివరములకు విమర్శకశిరోమణి శ్రీ కోన వేంకటరాయశర్మగారు రచించిన “దండనాధు" లను గ్రంధము చూడవలెను. తెలంగాణా కును, మరాటావాడకు మధ్య బీదరుజల్లాలో పింగళి యను గ్రామము కలదట. కాని పింగళి సూరనగారి యభిజన గ్రామమగు పింగలి యా గ్రామమనుట కాధారములు లేవు. సూరనగారిది గౌతమగోత్రము పిన్నెలివారిది భారద్వాజస గోత్రము కాని పిన్నెలిలో కొలవాసియను నింటి పేరుగల నియోగులు గౌతమగోత్రులు కలరు. పూర్వము వారింటి పేరు