పుట:పల్నాటి చరిత్ర.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

52

పల్నాటి చరిత్ర


ఇతర ప్రఖ్యాత పురుషులు

1. దుగ్గరాజు రాజనాయకుడు:- 13 వ శ తా బ్ద ము వాడు. కాకతీయగణపతిదేవునికి విశ్వసనీయులగు సేనానులలో నొకడు. గణపతి కళింగ దేశముపై 1212 A. D. ప్రాంతమున చేసిన యుద్ధములందితడు ముఖ్యుడు. 1228 A.D న గణపతి దేవుని పై కుట్రలు చేసిన సామంతరాజులు నడచుటయందు ఇందులూరి సోమయ్య మంత్రికితడు సహాయము చేసెను. ఈ రాజనాయకుని కుమారుడగు కాటయ శ.క. 1158 (1236 A. D.) లో భూదానము చేసినట్లు ఉప్పరపల్లె శాసనములో నున్నది. ఇతడు పల్నాటిలోని దుర్గి వాస్తవ్యుడనియు, దుగ్గరా జను గృహనామము కలవాడనియు, నియోగి బ్రాహ్మణుడ నినియు, ( Hyd Arch Ser No 3) లోని 'కరుణాన్విత దుర్గివరము కాటయ కొసగున్' అను పద్యపాదమునుబట్టి దుర్గి యనగా పల్నాటిలోని దుర్గిగ్రామమునగల పార్వతి యనియు, కాటయకాలమునుండి దుర్గినిబట్టి గృహనామము దుగ్గరాజు అని వచ్చెనని యూహింపవచ్చుననియు కోన వేంకటరాయ శర్మగారు దండనాధులను గ్రంధములో వ్రాసిరి.

2. పింగళి గోవిందయ్య:- ఇతడు 'కల్యాణి' రాజధాని గా నేలిన పశ్చిమచాళుక్యుని ప్రభువగు త్రిభువనమల్ల విక్రమాది త్యుని ప్రచండ సేనానియగు అనంతపాలయ్యకు మేనల్లుడు. 12 వ శతాబ్దమువాడు, కొండపల్లి దుర్గాధిపతి, నియోగి శైవ