పుట:పల్నాటి చరిత్ర.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పల్నాటి చరిత్ర

51

వీరి యింటివేల్పగు అంబపేర అంబాపురము కట్టబడి నట్లును, అల్లుమల్లెపాడు, మల్లవర అగ్రహారముల వీరిచ్చినట్లు చెప్పెదరు. శంకరనారాయణ పెద్ద అగ్రహారమును రేమిణి వారికిచ్చెను. చిన అగ్రహారమును పరీధావి (1738 A. D )లో వెంపటివారికిచ్చెను. వీరిచ్చిన అగ్రహారములలో త్రిపురసుం దరీపురము, వెంకమాంబాపురము, నరసమాంబాపుర మను నవి సర్కారులెక్కలలో గురజాలకు శివారులుగా నున్నవి. అంతట పల్నాడు ఆర్కాటునవాబు స్వాధీనమయ్యెను. మంత్రప్ప మనుమడు వీరభద్రయ్య వరుసగా 34 సంవత్సరములు పల్నాటికి దేశముఖుడుగా నుండెను. అడిగొప్పుల అయ్యవార్లంగారు పరవస్తు శ్రీనివాసాచార్యులు గారికి నిధానంపాడు అగ్రహారమును రామరాజు వీరభద్రయ్య దేశాయి క్రీ. శ. 1718లో నిచ్చెను. నవాబుకు చెల్లించవలసిన పైకము సరిగా చెల్లించనందున నవాబగు మహమ్మదుఖాన్ క్రీ.శ. 1764 లో నీరభద్రయ్యను తొలగించెను. వీరభద్రయ్య కుమారుడు రాజే శ్వరరాయుడు అప్పటినవాబగు వాలాజా గారికి అర్జి పెట్టుకొనగా నవాబతనికి నెల 1 కి 200 వరహాల చొప్పున భరణ మిచ్చెను. అటుపిమ్మట నెల 1 100 వరుకు వరహాలకు తగ్గిం చెను . పల్నాడు ఆర్కాటునవాబునుండి ఈస్టుయిండియా కంపెనివారికి స్వాధీనమయినపిమ్మట రాజేశ్వరరావు బ్రదికి యున్నంతవఱకు నెల 1 కి 75 వరహాల చొప్పున కంపెనివారు భరణమిచ్చిరి. క్రీ శ. 1825 లో రాజేశ్వర రావు చనిపోయెను, పిమ్మట నాసంతతివారికి భరణమిచ్చుట మాని వేసిరి.