పుట:పల్నాటి చరిత్ర.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

50

పల్నాటి చరిత్ర

ఫర్మానామూలమును, తదితర పూర్వపు కాగితములును మంత్రప్పవంశీయుడగు గామాలపాటి కరణమువద్ద నిప్పటికిని నున్నవి. తానీషా యిచ్చిన ఫర్మానా భరణపు వ్యవహార సందర్భమున కోర్టులో దాఖలు కాబడినందున నకలుమాత్రమున్నది. ఔరంగజేబుయిచ్చిన ఫర్మానామూలమున్నది. పారశీక భాష లోనున్నది. వానిని నేను చూచితిని. క్రీ.శ. 1707 లో ఔరంగ జేబుచనిపోయెను. అప్పటినుండి యితర ప్రాంతములతో బాటు పల్నాడు నిజాముల స్వాధీనమయ్యెను. మనదేశములో రాజులు మారినను జమీందారీతనము గ్రామజీవనము మొదలగునవి మారలేదు. 1138 ఫసలీ కీలక సం॥ (1729 A. D) లగాయతు 1140 ఫసలీ సాధారణ సం॥ (1731 A. D.) వఱకు రామరాజు జంగమయ్య అటుపిమ్మట శంకరనారాయణ మహమ్మద్ ఖానుకు లోబడి పల్నాటికి దేశముఖులుగానుండిరి. మంత్రప్ప కుమారుడు జంగమయ్య పల్నాటిలోని స్తలకరిణీకముల ననేకము లిచ్చెను. గురజాలవద్దనున్న జంగమహేశ్వరపురమును తన పేర కట్టించెను. రామరాజు శంకరయ్య సత్రసాలకు సర్వ మాన్యముగా 50 కుచ్చెళ్ల భూమిని దానమిచ్చెను. (కుచ్చెల యనగా 30 ఎకరములుండును) మాచెర్ల వీరభద్రస్వామికి 10 కుచ్చెళ్ల భూమి ఈనామిచ్చెను . వీరియింటియాడపడుచు నానమ్మ యనునామె జంగమహేశ్వరపురమువద్దనున్న నానమ్మ చెరు వును తనపేర త్రవ్వించెను. దేవాలయములకును లంకావారు మున్నగు బ్రాహ్మణులకునింకను కొన్ని భూదానములీయబడెను