పుట:పల్నాటి చరిత్ర.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పల్నాటి చరిత్ర

49

హిజరి 1091 (1678 A. D.) లో సంపాదించెను. శిస్తులో నూటికి అయిదువరహాల చొప్పున జమీందారి రుసుమున్ను, నూఱుకుచ్చెళ్లకు 5 కుచ్చెళ్ల చొప్పున ఈనామున్ను ప్రతిసంవత్సరము పుత్రపౌత్ర పారంపర్యముగా ననుభవించునట్లు ఈయబడెను, ఆఫర్మానామీద ముంజుదారు సూర్యప్రకాశ రావుజీయని మహారాష్ట్ర భాషలో సంతకముండెను. ముంజుదా రనగా మహారాష్ట్ర పరిపాలనా పద్ధతిలోని యార్థికమంత్రికి పేరు. సూర్యప్రకాశ రావనునది మాదన్న కుబిరుదు. అక్కరు సుభాన్ పంతులు గారు (అక్కన్నగారు) పల్నాటిని పర్యటించి హనుమంతునిపాడు, వీరభద్రాపురమను గ్రామములు కట్టించి మాచెర్ల వీరేశ్వరస్వామికి (వీరభద్రునకు) యీ నాముగా 23 రబ్బీరవల్ 1092 హిజరి (1674 A. D.) తేదిననిచ్చెను. ఆ రెండుగ్రామము లిప్పుడు లేవు. శిధిలములైనవి. క్రీ.శ. 1687 లో గోల్కొండరాజ్య మపురంగజేబు వశమయ్యెను. అలంగీరు పాదుషా (ఔరంగజేబు) చేత 1106 హిజరీలో (1688 A.D.) పల్నాటితాలూకా మాచర్ల, గురజాల, కారెంపూడి, తుమృకోడు, తంగెడయను యయిదు పరగణాలు రామరాజు మంత్రప్పకు తహసీలు వసూలు చేయుట జరుపగలందులకు పుత్రపౌత్ర పారంపర్యముగా నధీనముచేయబడెను. సంవత్సరమునకు సర్కారుకు 28 వేల వరహాలు శిస్తు షేష్కసుగానుండెరు. అక్కన్నగారి దానశాసనపు, నకలును తానీషా మంత్రప్ప కిచ్చిన ఫర్మానాకు నకలును ఔరంగజేబు మంత్రప్పకిచ్చిన