Jump to content

పుట:పల్నాటి చరిత్ర.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

48

పల్నాటి చరిత్ర

శీఘ్రఫలితములనిచ్చి యెక్కువభూమి సాగుబడి యీ ప్రాజెక్టు వలన కాగలదు. ఇప్పటి యంచనాల ప్రకారము ఈ ప్రాజెక్టు వలన 70 లక్షలయకరముల భూములు సాగగును. 2 లక్షల కిలోవాట్ల విద్యుచ్ఛక్తి యుత్పత్తికాగలదు. 35 లక్షల టన్నుల ధాన్యమధికముగా నుత్పత్తికాగలదు. అదిగాక ఈ ప్రాజెక్టుకు నగు ఖర్చులో కొంత భాగమును నైజాము ప్రభుత్వము భరించును గనుక మితవ్యయముతో నిది పూర్తికాగలదు.

రామరాజు మంత్రప్పదేశాయి

'అబుల్ హసన్' అనునతకుడు గోల్కొండ రాజ్యమును క్రీ. శ. 1672 నుండి 1687 వఱకు పాలించెను. ఇతడు హిందువులను మహమ్మదీయులను సమానముగా జూచెను. ఇతనికి తానీషాయను బిరుదుకలదు . ఇతనికాలముననే భద్రాద్రి రామదాసుకధ జరిగినది. అదివఱకు మంత్రిగానుండిన ముజాఫరును దొలగించి పింగళి మాదన్నను క్రీ.శ. 1673 లో మంత్రి కానియమింను పింగిళి మాదన్నకు సూర్యప్రకాశరావను బిరుదముకూడ పిచ్చెను. మాదన్నకు సోదరుడగు అక్కన్న యితనివద్ద సేనాపతిగానుండెను. అప్పుడు పల్నాడు గోల్కొండ నవాబు క్రింద నుండెను. అర్జీపెట్టి రామరాజు మంత్రప్పదేశాయి యనునతడు తానీషానుండి, మాచర్ల, తుచ్చుకోడు కారెంపూడి, గురజాల తంగెడ యను అయిదుపరగణాలను మహసూళ్ల చౌదరితనము (శిస్తు వసూలు చేయు నధికారముగల సీమ పెత్తనము) పుత్రపౌత్ర పారంపర్యముగా నుండు నట్లు