పుట:పల్నాటి చరిత్ర.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పల్నాటి చరిత్ర

47

హీనయానులని మహాయానులని రెండు తెగలు. హీనయానులు విగ్రహారాధన చేయరు. మహాయానులు విగ్రహారాధన, ఉత్సవములు చేయుదురు. బుద్ధుని ప్రతిమతోబాటు హిందూ దైవత విగ్రహములనుకూడ పూజింతురు. నాగార్జునుడు మహాయానశాఖను నిర్మించెను. ఇతనికి యజ్ఞశ్రీశాతకర్ణి యను యాంధ్రప్రభువు పోషకుడుగ నుండెను.

నందికొండ

నందికొండ యనుచోట కృష్ణానదికి యానకట్టకట్టుటకు కేంద్ర ప్రభుత్వము నియమించిన ఖోస్లా కమిటీ సూచించినది. ఈ స్థలము మాచర్లకు 12 మైళ్ల దూరమునను నాగార్జునకొండ కైదుమైళ్లదిగువను, నాగులవరమను గ్రామమునకు దగ్గరగాను నుండును. ఇచ్చట కృష్ణకావలి యొడ్డున నందికొండయను గ్రామముండుటచే దీనికాపేరు వచ్చినది. కృష్ణానదికి రెండువైపుల రెండుకొండలు పెట్టనిగోడలవలె నుండును. నదీగర్భము శిలామయమగుటచే పునాగులకు నెక్కువఖర్చు లేదు. కృష్ణకు రేడువైపుల రెండులోయలు ప్రకృతిసిద్ధముగా నుండుటచే కాలువలుత్రవ్వుట సులభము, ఇచ్చట ఆనకట్టకట్టి యెడమ వైపు కాలువ త్రవ్వుటకు నైజాము ప్రభుత్వ మిదివఱకే పూను కొనినది. కుడివైపున కాలువలు త్రవ్వినయెడల గుంటూరు, కర్నూలు నెల్లూరుజిల్లాలు సాగయి చెన్న పట్టణమునకు నీటి సప్లయి చేయవచ్చునని అంచనా వేయబడినది. ఇది ఆనకట్ట కట్టుటకు ప్రకృతిసిద్ధముగ తగిన స్తలము, తక్కువఖర్చుతో