పుట:పల్నాటి చరిత్ర.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

46

పల్నాటి చరిత్ర

ణమందలి గృహములపునాడు లిప్పటికిని కన్పించు చున్నవి. కృష్ణానదినుండి పట్టణములోనికి పోవుటకుగల కాలువజాడ లిప్పటికినున్నవి. ఇచటనొక విశ్వవిద్యాలయముండెడిది. బౌద్ధ సన్యాసులు నివసించుగదుల పునాదులు గన్పించుచున్నవి. వారు మూత్ర విసర్జన చేయుటకు వీలగు సన్నని (రాతితో చేయ బడిన) కాలువలిప్పటికి స్పష్టముగా గన్పించుచున్నవి. మొత్తముమీద నాగార్జునకొండవద్ద మూడు సంఘారామములు, ఆఱు బౌద్ధాలయములు 14 స్తూపములు బయల్పడినవి. ఇందలి దృశ్యముల ఫొటోలనుగల్గిన పురాతత్వశాఖ వారి పుస్తక మిచ్చటొకటి కలదు. యాత్రికులా పుస్తకమును జూడవచ్చును. కాకతీయుల కాలమును కట్టబడిన కోటకోడలు ప్రాకారములు, దేవాలయములు, పెద్దదిగుడుబావి, కొండమీద కలవు. నాగార్జునుడను బౌద్ధసన్యాసి రెండవ శతాబ్దాంతమున నిక్కడ నివసించెరు. ఇతనిని బట్టియే దీనికీపేరు వచ్చెను. ఇతడాంధ్రుడు, బ్రాహ్మణుడు. హిందూదేశమంతయు తిరిగిన వాడు. శాతవాహనవంశపు రాజుల అంతఃపురస్త్రీలకు బౌద్ధ మతము బోధించెను. సుహృల్లేఖ మొదలగు కావ్యముల రచించెను. రసాయనిక శాస్త్రమందును, వైద్య శాస్త్రమందును ప్రవీణుడు, ప్రజ్ఞాపరిమితములు మొదలగు మహాయానసూత్రములను రచించెను ఇతని గ్రంధములన్నియు సంస్కృతభాషలో ఉన్నవి. చీనాటిబెట్టులలో నితడు ప్రసిద్ధుడు. ఇప్పటికి నా దేశ ప్రజల చేత పూజింపబడుచున్నాడు. బౌద్ధమతములో