పుట:పల్నాటి చరిత్ర.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పల్నాటి చరిత్ర

45


నాగార్జునకొండ

మాచర్ల రైలు స్టేషనునుండి 14 మైళ్ల దూరమున నిది కలదు. మాచర్లనుండి యిచటకు రోడ్డుకలదు. ఇది పర్వతములమధ్య కృష్ణానదీ తీరమున నున్నది. దీనిదగ్గర పుల్లారెడ్డిగూడెమను గ్రామమున్నది. 25 సంవత్సరముల క్రింద నిచట త్రవ్వగా కొన్ని బౌద్ధవిగ్రహములు బయల్పడినవి. వానినన్నిటి నొక చోట చేర్చి యొక శిల్పవస్తు ప్రదర్శనశాల (మ్యూజియమును) గవర్నమెంటువారు కట్టిరి. చూడవచ్చు యాత్రికుల సౌకర్యార్ధ మొక బంగళానుకట్టిరి. ఇచట కొన్ని బౌద్ధవిగ్రహ ములు, స్తూపములు, శైత్యములు, విహారములు, సంఘారామములు బయల్పడినవి. శిధిలమైన యిచటిస్తూపమునందలి పునాదులును ప్రదక్షిణాపధమును మిగిలియున్నవి. ఈ స్తూప వృత్తముయొక్క వ్యాసము 102 అడుగులు. ఇందుకుపయోగించిన యిటుకల పరిమాణము 20" X 10" X 3" . ఈస్తూపము చుట్టు 5 అడుగులయెత్తున ప్రదక్షిణ పధమున్నది. బ్రాహ్మిభాషలోని కొన్ని శిలాశాసనములును, కొన్ని రోమీయ నాణెములు, ఇక్ష్వాకు నాణెములు దొరకినవి. అనేక రత్నములతోగూడి జాగ్రత్తగా భద్రపరచబడి యొక బంగారు బరిణలో బుద్ధుని యెముక దొరికినది. గోళకారమగు మొక పెద్ద కుండ దొరికినది. దానివ్యాసము 6 అడుగులు . అది సమానమగు రెండు డిప్పలు కలిగియున్నది. రెంటిని కలిపిన పెద్ద బంతివలె నొకకుండ యగును. నాగార్జునకొండవద్ద విజయపురియను పట్టణముండెడిది. ఆ పట్ట