పుట:పల్నాటి చరిత్ర.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

44

పల్నాటి చరిత్ర

నాడు దీవించి యతనిని యుద్ధభూమికి బంపెను. బాలచంద్రుని వెంట బ్రాహ్మణుడగు యనపోతు ఉండెను. అతడు యుద్ధమున చనిపోయినచో బ్రహ్మహత్యాపాతకము తనకువచ్చునని భయపడి యేదియోయొక నెపముతో నింటికిబంపెను. తన యానగా యుద్ధభూమికి రావద్దని చీటి చెట్టుకు కట్టి యుద్ధభూ మికి బాలచంద్రుడేగెను. అనపోతు తిరిగివచ్చి చీటిచూచుకొని బాలుని యానదాటలేక సమరోత్సాహము భంగమయినందులకు వ గచి, పొడుచుకొని చచ్చెను. అతని రక్తపుజందెమును మాడచి యనునామె కారెంపూడిలోనున్న బాలచంద్రుని కందజేసెను. స్నేహితుడుగు ననపోతు మరణమునకు వగచి బాలచంద్రుడు సమరోత్సాహ మినుమడింప యుద్ధమును నిశ్చయించెను. సైనికులు సంధి ప్రయత్నమున గుడుచు యన్నమును నాగులేటిలో పాఱవేసి వారలను యుద్ధమునకు ప్రోత్సహించి సంధిచెడగొట్టెను. అభిమన్యునివలె యుద్ధములో బోరెను. నాయకురాలి దుశ్చేష్టలకు తోడుగానున్న నరసింగరాజు తలనుగోసి బ్రహ్మనాయని ముందట వైచెను. మరల యుద్ధము నకు బోయి చాలమందిని జంపి తానుజచ్చెను. యుద్ధము సందు మలిదేవాదులుకూడ చనిపోయిరి. నాయకురాలు బందికాబడెను. స్త్రీని చంపకూడదుగనుక దేశమునుండి వెడల గొట్టబడెను. నాయకురాలి మైకమునుండి నలగామరాజు విముక్తుడై పశ్చాత్తాపపడి హతశేషులతో రాజ్యమేలెను. ఈ యుద్ధము క్రీ. శ. 1180 ప్రాంతమున జరిగెను.

_____________