పుట:పల్నాటి చరిత్ర.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

54

పల్నాటి చరిత్ర

పిన్నెలియనియు, వారిపూర్వులలో నొకడు భూమికొలతయందు వాసికెక్కుటచే కొలవాసి యను పేరు పౌరుషనామధేయముగ వచ్చెననియు వారనెదరు. సూరనయు నతని తండ్రి తాతలు నంద్యాల ప్రాంతముననే నివసించిరి.

4. దుర్గిలోని సాధ్విలక్ష్మి:- ఈమె స్తానం పల్నాటిలోని దుర్గి. కమ్మకులము, తండ్రి దిగుమర్తి ముసలప్పనాయుడు, భర్త చిరుమామిళ్ల వెంకానాయుడు. ఈమె కోడరికమందలి కుటుంబ బాధల నోర్చెను. తనను భర్త చంపుచున్నను ప్రాణ ములవిడుచు సమయములో గూడ భర్తయొక్క దయనేకోరెను. ఈమెయిప్పటికిని పూజింపబడుచున్నది. ఈమెకధను సంచారిక శధకులు బొబ్బిలికధవలె చెప్పుచుందురు. ఈమెకధను లక్ష్మమ్మ శ్రీలక్ష్మమ్మ యను రెండు సినిమాలుగా చిత్రించినారు.

5. పిడుగు శంకరయ్య:- శంకరయ్య యను పురుషుడు పల్నాటిలోని గాదెవారిపల్లెవద్ద సిద్ధి (జీవసమాధి) నొందెను అందుచేనాగ్రామప్పటికి సర్కారు లెక్కలలో 'శంకరాపురం సిద్ధిహాయి' అని వ్యవహరింపబడుచున్నది అతని వంశములోని వారిలో కొన్ని వివాదములుగలిగి సమాధిమీదిరాతిని తొలగింపగా నతడు జీవించియుండెనట. అతడు వివాదముల దీర్చెనట. మరలనట్లు తొలగింపకుండుటకై నతని కోరికపై వారతని సమాధిపై స్థిరముగా గచ్చుతో కట్టబడి చేసిరట.

6. బెల్లంకొండ సుబ్బారావుగారు:- వీరి స్వగ్రామము పల్నాటిలోని తక్కెళ్లపాడు. గురజాల, నరసరావుపేటలో న్యాయవాదిగా నుండిరి. సుప్రసిద్ధ నటకులు. కృష్ణరాయబారములో శ్రీకృష్ణపాత్రను ధరించి ఆంధ్రదేశములోని ప్రతిపట్టణములోను ప్రసిద్ధికెక్కిరి.