పుట:పల్నాటి చరిత్ర.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

40

పల్నాటి చరిత్ర

ఖండము శాలివాహనశక 1508 (క్రీ.శ. 1585) లో రచింప బడెను. మార్కండేయ ప్రభుని కాలము క్రీ. శ. 1570 నుండి ప్రారంభము. ఇతనిపూర్వులలో నైదవతరమువాడు బెజవాడను పాలించి బెజవాడ ప్రభువని ప్రసిద్ధిగాంచెనని నాగరఖండము చెప్పుటచే నతని రాజ్యము బెజవాడవఱకుండెననియు, విజయవాడకు బెజవాడయని యప్పటికే పేరుండెననియు నూహింపవచ్చును. మార్కండేయ ప్రభు వనేకదానములు చేయుటేకాక శ్రీశైలమున నేకాదశలింగముల ప్రతిష్టించెనట.

నాగరఖండ కవులు తమ్ముగూర్చి చెప్పికొనినది.

కం॥ అభినవ విశ్రుతకవితా|
     విభవుల మఖిలాగమాంతవిద శౌనక గో|
     త్ర భవులము బుధవిధేయుల |
     మభవపదాంభోజ బంభరాత్ములము మహిన్.
     
కం॥ రసికుడు తుర్కారాజన |
     వసమప్రతిభావి రాజీయ య్యాంకిత బా|
     ల సరస్వతియనువారల |
     మసహిష్ణువజ విహారణార్థులము మతిన్ |
     
చ॥ మము బిలిపించి చాల బహుమానమొనర్చి కవీంద్రులార స్కాం |
    దమున మహాప్రసిద్ధమగు నాగరఖండమఖండ విశ్వక |
    ర్మ మహిత వైభవాకరము మాకు తెనుంగున నంకితంబుగా|
    రమణ ఘటింపగాదగు బురాణవిదుల్ మదిరాణమెచ్చగన్.

పెందోటయు తత్ప్రభుని వర్ణనము

(నాగరఖండములోని పద్యములు)

సీ॥ కోటయేవేయివీటికి మేటియై మిక్కిలి |
         చూపట్టు చక్కని చుట్టుగట్టు
    క్రీడాద్రులేపురికిని సప్తకుల పర్వతములునా మేరు