పుట:పల్నాటి చరిత్ర.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పల్నాటి చరిత్ర

39


లక్ష్మీచెన్నకేశవోత్సములు జరుగును. చైత్ర బ॥ పంచమినాడు రధోత్సవము జరుగును. అప్పుడు వేలకొలది జనులువచ్చెదరు. కార్తీక అమావాస్యనుండి కారెంపూడిలో వీరుల తిరుణాల జరుగును. మార్గశిర పూర్ణిమనాడు గురజాలలో పాతపాటమ్మ తిరుణాల జరుగును. పైమూడు తిరుణాలలకును పల్నాటివీరుల కధలు సుద్దులుగా చెప్పెదరు. క్రిసమసు పండుగకు రెంటచింతలలో క్రిస్టియనులతిరుణాల జరుగును.

పెందోట

పల్నాటిలో నాగార్జునకొండకు 8 మైళ్ల నైరుతి మూలన కృష్ణాతీరము పెందోటయను పట్టణము 16, 17 శతాబ్దము లలో నుండినది. ఇప్పుడా ప్రదేశమంతయు యడవులతో నిండి యున్నది అందలి దండపాణీశుని యాలయముకూడ యిప్పుడు లేదు. పెదోటవారిప్పు డచటచ్చట వలసవచ్చియున్నారు. పెందోటను పాలించిన మార్కండేయ భూపాలుడు క్రీ. శ. 1585 ప్రాంతముననుండెను. మహమ్మద్ ఖులీ ఖుతుబ్ రశాహీ యను తురుష్క - ప్రభువు క్రీ.శ 1580 మొదలు 1611 వఱకు గోలకొండ రాజ్యమును పాలించెను. అతనికీ మార్కండేయ ప్రభువు సామంతుడై దండయై యతని రాజ్యవిస్తరణకు తోడ్పడెను. తుర్కారాజకవి అయ్యంకి బాలసరస్వతి యను నిరువురు కవుల నీమార్కండేయ ప్రభువు పోషించెను. స్కాంద పురాణము లోని నాగరఖండమును వారిచే తెలుగు చేయించి తాను కృతి నొందెను, మార్కండేయ ప్రభువు విశ్వబ్రాహ్మణుడు. నాగర