పుట:పల్నాటి చరిత్ర.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

38

పల్నాటి చరిత్ర

గుత్తికొండ బిలము:- తొలి యేకాదశినాడు చాల మందివచ్చి బిలములో స్నానము చేసి దానికి దగ్గరగానున్న చేజెర్లలోని కపోతీశ్వరాలయమును దర్శింపపోయెదరు.

తేరాల:- మాచర్లకు అయిదు మైళ్ల దూరమున కలదు. ఇందు సిద్ధేశ్వరస్వామిగుడి గలదు. శివరాత్రికి యాత్రికులు వచ్చెదరు. అచ్చటగల యొక గుండములో స్నానము చేసి గుడి లోనికి పోయెదరు.

ఎత్తిపోతల:- లోయలోగల రంగనాయక స్వామియాల యమునకు వైకుంఠయేకాదశినాడు కొందఱు యాత్రికులు పోయెదరు

దైద:- గ్రామము వెలుపలనున్న శివాలయమునకును దానికి దగ్గరగానున్న బిలమునకును శివరాత్రికి యాత్రికులు పోయెదరు. ఇచ్చటకు రెండు మైళ్ల దూరమున కృష్ణానదికలదు. కొండలోనుండి శివలింగమునకు క్రిందుగా నీటిధార యన్ని ఋతువు లందును వచ్చుచుండును. వానిని బుగ్గలనియెదరు. బుగ్గనీరు కృష్ణలో కలియును. కొండపైనపడినవర్షపు నీటిలో కొంతభాగము కొండలోని కింకును. ఆ ఇంకుడు వలన బావిలో జలలవలె ధారగా నీకు కొండనుండి బయటికి వచ్చుచుండును. దుర్గి వద్దకూడ నిట్టిబుగ్గలు కలవు.

ముఖ్యమగు తిరుణాలలు

శివరాత్రికి సత్రశాల, తేరాల, దైద మొదలగు చోట్ల తిరుణాలలుజరుగును. చైత్రశుద్ధ పూర్ణిమ మొదలు మాచర్లలో