పుట:పల్నాటి చరిత్ర.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పల్నాటి చరిత్ర

37

యున్నది. వీరభద్రస్వామి గుడి మండపపు పైకప్పు యొక్క లోపలిభాగమందు పురాణకధలు చిత్రింపబడినవి. వేంకటేశ్వరాలయపు ద్వారబంధముల శిల్పకళ చాల రమ్యముగానుండును. ఆలయమునకు పెద్ద రధముకలదు. రధచక్రములు మూడు గజముల యెత్తుండును.

ఏలేశ్వరము:- మాచర్ల నుండి నాగార్జునకొండ మీదుగ పడమర మూడుమైళ్లుపోయి కృష్ణానదిని దాటిన యేలేశ్వరపు శివాలయ ముండును ఇది నైజాములోనిది. శివరాత్రికి యాత్రికులు పోయెదరు. బ్రహ్మనాయని విగ్రహముకలదు.

సత్రశాల:- కృష్ణానదియొగ్గున జెట్టిపాలెమను గ్రామమునకు మూడు మైళ్ల దూరమునగల శివక్షేత్రము, శివరాత్రికి తిరుణాళ్ల జరుగును. చాలమంది యాత్రికులు వచ్చెదరు. పడవనెక్కి కృష్ణానదిమీద విహారము చేయవచ్చును.

సంగమేశ్వరము:- పొందుగుల వద్ద కృష్ణానదిని దాటిన యావలి యొడ్డునగల వాడపల్లియను గ్రామము వద్ద నిదికలదు. ఇది శివక్షేత్రము. శివలింగముపైనగల గుంటలో నీరుండును. ఆనీటిని పాఱపోసినయెడల మరల నీరూరుచుండును. ఇది నైజాములోనిది.

మట్టపల్లి:- తంగెడ వద్ద కృష్ణనదాటిన యావలి యొడ్డున నిదికలదు. ఇందు నరసింహస్వామి యాలయముకలదు. ప్రతి సంవత్సరము వైశాఖ పూర్ణిమ నాకు యుత్సవము జరుగును. ఇది నైజాములోనిది. O