పుట:పల్నాటి చరిత్ర.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

36

పల్నాటి చరిత్ర

నొకకరణము సమాధియున్నది. కొండమీదకురిసిన వర్షపు నీటిలోని కొంతభాగము కొండలోనికిదిగి ప్రకృతిసిద్ధముగా నాకొండలో నేర్పడిన ఖాళీ స్థలములో నానీరు నిలిచినది. బయటినుండి యానీటివద్దకు బోవుటకు మార్గముగా బిలము పకృతిసిద్ధముగా యేర్పడినది. దైదవద్దకూడ నొక చిన్న బిలము కలదు. శివరాత్రినాడు యాత్రికులచ్చటకు పోయెదరు.

కారెమపూడి వీరులగుడులు:- నాగలేటియొడ్డున గంగధార మడుగునకు సమీపమున యుద్ధములో చనిపోయిన వీరుల పేర చిన్న గుడులు, విడి స్తంభములు, మండపములు కొన్ని కలవు. కొన్ని శాసనములుకూడ కలవు. దానికి సమీపముననే యుద్ధము జరిగిన ప్రదేశముకలదు. ఇప్పుడది రైత్వారీపొలముగా నున్నది.

పుణ్యక్షేత్రములు

మాచర్ల:- చెన్న కేశవాలయమున్నది. ఇది చాల పూర్వుల ప్రతిష్టయనియు ఈగుడిని బ్రహ్మనాయుడు పెద్దదిగా కట్టించి మండపప్రాకారాదులు నేర్పఱచెనందురు. ఆలయము పెద్దది, జమ్ములమడకయను నగ్రహార మీగుడికీనాముగానున్నది. ఇది H R E బోర్డు వారి పాలన క్రింద నున్నది. ఇందు ఆదిత్యేశ్వరాలయము (శివాలయము), శిథిలమయిన వేంకటేశ్వరాలయము కలవు. మండప స్తంభములమీ దను ఆలయప్రాకారపు గోడలమీదను శిల్పకళ చిత్రింపబడి