పుట:పల్నాటి చరిత్ర.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పల్నాటి చరిత్ర

35

దూరమునను కృష్ణానదికి మూడు మైళ్ల దూరమున నిదికలకు. త్రికోణాకారముగల లోయలోనికి నీకు దుముకి యటనుండి కృష్ణలోకలియును. లోయలోనికిదిగి నీరు పడుచోటికి పోవ చ్చును. సడి వేసవిలోనైనను కొద్దిగానైనను నీరు దుముకుచుండును. గొట్టిపాళ్లవద్ద పెద్దదూకుడు, చిన్నదూకుడు అను రెండు జలపాతములును, దైదవద్ద బీనీలగుండమను చిన్న జలపాతమును కలవు.

నాగార్జునకొండ:- దీనివిషయము ప్రత్యేకముగా వ్రాయడమైనది.

నాయకురాలి కనుమ:- కారెంపూడికి దక్షిణమున నాల్గు మైళ్ల దూరమున రెండు కొండలమధ్య నాగులేరు ప్రవహించును. దానిని నాయకురాలికనుమ యందురు. ఇచ్చట చిన్న యడవికలదు. కారెంపూడినుండి వినుకొండకు పోవు రోడ్డు యాకనుమగుండ పోవును.

గుత్తికొండ బిలము:- గుత్తికొండయము గ్రామమునకు మూడు మైళ్ళ దూరమున నుండును. చిన్న అడవియు కొండలును కలవు. కొండకు నొక పెద్ద బిలము (పెద్దకన్నము) కలరు. బిలము రమారమి 160 గజములుండును. కొన్ని చోట్ల విశాలముగను కొన్ని చోట్ల నిరుకుగను నుండును. ఇరుకుగానున్న చోట్ల వంగి పోవలెను. త్రోవలో చీలని చిన్నబిలములు కొన్ని యుండును. చీకటిగానుండును. అందు మంచి నీరుండును .పొడి వంటి తెల్లని పదార్థము నీటిపై తేలచుండును. బిలము ముందర