పుట:పల్నాటి చరిత్ర.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

34

పల్నాటి చరిత్ర

రెంటచింతల, మాచర్ల, రాయవరము, గోలి మొదలగుచోట్ల నాపరాయితీసి యితర జిల్లాలకు రైలుమీద నెగుమతి చేయుదురు. పిడుగురాళ్ల వద్ద సిమెంటుకు పనికివచ్చు రాయికలదు. దానిని తీసి రైలు మీద తాడేపల్లిలోని సిమెంటుఫాక్టరి యెగుమతి చేయుదురు. కారెమపూడిలోను దాచేపల్లిలోను ఆకుతోటలు, నారింజ మొదలగు ఫలవృక్షములు గల తోటలు నాగులేటి నీటిచే సాగగుచున్నవి. దండుబాటలో కృష్ణకీవలిగ్రామమగు పొందుగుల వఱకును, ఆవలి గ్రామమగు వాడపల్లి నుండి హైదరాబాదుకు మోటారు సర్వీసు కలదు. హైదరా బాదు వాడపల్లికి 100 మైళ్లుండును. కృష్ణను పడవలలో దాటెదరు. నాగార్జునకొండ ప్రాంతమున కొండపిండియని పిలువబడు చెట్టుపూత దొరకును. దూదికి బదులు పరుపులకు దిండ్లకు వాడిన చలువగానుండును. కారెంపూడి ప్రాంతమున నడవులలో నుండు కొరనాసియను జంతువునుండి క్రొవ్వుదీసి వాతనొప్పులకు నౌషధముగా వాడెదరు.

పిల్లుట్ల:- గుఱ్ఱం వీరారెడ్డిచే స్తాపింపబడిన అనాధశరణాలయ మున్నది. హైస్కూలు వసతి గృహము నున్నవి.

దృశ్యములు

ఎత్తిపోతల:- ఇది జలపాతము, చంద్రవంక వాగులోని నీరు 66 అడుగుల ఎత్తునుండి క్రిందికి దుముకుచుండును . చూచుటకు మనోహరముగా నుండును. మాచర్లకు 5 మైళ్ళ