పుట:పల్నాటి చరిత్ర.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పల్నాటి చరిత్ర

33

శ్రీనాధుడు భోగి, మరియన్నము దినుచు సన్నని వస్త్ర ముల గట్టుచు నుద్యానవనములందు దిరుగుచు మృదు శయ్యల బవ్వళింపుచు విలాసముల దేలువాడు, పల్నాటిలోని గ్రామజీవితమును నందలిజొన్నన్నము రుచింపలేదు. అదియును గాక యాకాలమునాటి స్తితిని శ్రీనాధుడు వర్ణించియుండును. కాని యిప్పుడు మార్పు జెంది నాగరికతయందు పల్నాడు పురోగమించినది.

ప్రస్తుత స్థితి

____________

రెంటచింతలలో పెద్ద మిషన్ వైద్యాలయము కలదు. ఆ గ్రామమునందే గ్రుడ్డివారిలకు పాఠశాలకలదు. అక్షరముల నుబ్బెత్తుగా పెద్దవిగా ప్రత్యేక కాగితములమీద తయారు చేయుదురు. గ్రుడ్డివారలా యక్షరముల దడిమి చూచి స్పర్శ జ్ఞానముచే వారియాకారములు తెలిసికొని చదివెదరు. వారికై తయారుకాబడిన ప్రత్యేకపుస్తకములను మాత్రమే చదువ గలరుకాని యన్ని పుస్తకములను చదువలేరు. ఇచ్చట మంచి రాయిదొరకును, గచ్చుగోడలుకట్టుటకు రెంటచింతల రాయి ( శ్రేష్టమయినది. కాగితములమీద బరువునకై పెట్టు రాళ్లను (Paper-weights ) అందముగా తయారు చేయుదురు. దుర్గిలో పనితనముగల రాతివిగ్రహములను తయారుచేయుదురు. తాళ్లపల్లిలో పట్టంచు ఖద్దరు దోవతులను నవారును పరదాలను తయారుచేయుదురు. ఇండ్లకు పఱచు టకు పనికి వచ్చు నాపరాయి పల్నాటిలో విరివిగా కొరకును.