పుట:పల్నాటి చరిత్ర.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

26

పల్నాటి చరిత్ర


పల్నాటిలో భట్టువారిపల్లెలో నుండిరి. ఇప్పుడు లేచిపోయినారు. భట్టుమూర్తియు రామరాజభూషణకనియు కాశ్యపసగోత్రులు. వీరును కాశ్యపసగోత్రులు,భట్టుమూర్తియొక్కయు రామరాజభూషణుని యొక్కయు వంశజులను తానుచూచి నాననియు, వారు ప్రబంధాంకము వారనియు, పల్నాటిలోని భట్టువారిపల్లెలో పదిదినములు వారితో నివాసము చేసితిననియు, వారితో మాట్లాడితిననియు, వారు సాహిత్యములో ప్రవీణులనియు, రామరాజభూషణుని యొక్కయు మూర్తి కవియొక్కయు నివాసగ్రామము పల్నాటిలోని భట్టువారిపల్లెయనియు 1919 సం॥ మే 28 వ తేదిగల యాంధ్రపత్రిక యుగాది సంచికలో వైయాకరణము గోపాల జయదేవరాజుగారు వ్రాసినారు.

(2) నరసభూపాలీయములో మూర్తికవి 'అమితయమకాశుధీ ప్రబంధాంక' యనియు గద్యములో 'ప్రబంధపఠనారచనా ధురంధర ప్రబంధాంక వేంకటరాయ...' అని యుండుటచే ప్రబంధములు పఠించుటయందును రచించుటయందును గల ప్రజ్ఞనుబట్టి పౌరుషనామధేయముగా ప్రబంధాంకమనివచ్చెనని తెలియుచున్నది. ఇట్లే విద్యాధరిణి మొదలగునవి భట్రాజు లలో పౌరుషనామధేయములు, విద్యాధరణీవారు భట్రాజు లలో పల్నాటిలో మాచెర్ల మొదలగుచోట్ల యిప్పటికిని నున్నారు. వేంకటరాయభూషణుడు, రామరాజభూషణుడు, అనునవి యయావారలచే భూషింపబడినట్లు బిరుదములే కాని నిజనామములు కావనియు, కావ్యాలంకారసంగ్రహము (నరస