పుట:పల్నాటి చరిత్ర.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పల్నాటి చరిత్ర

25

రామరాజభూషణుడు వసుచరిత్రమును, హరిశ్చంద్రనలో పాఖ్యానును ద్వ్యర్థి కావ్యమును రచించెను. వసుచరిత్రను తిరుమలరాయని కంకితమిచ్చెను. తిరుమల దేవరాయలు క్రీ.శ. 1567-1577 వఱకు విజయనగర సామ్రాజ్యమును పాలించెను. మూర్తికవి కావ్యాలంకార సంగ్రహమను నలంకారశాస్త్రము వ్రాసి నరసరాజున కంకితమిచ్చెను. రామరాజభూషణుడును మూర్తికవియు సమకాలికులు. అన్నదమ్ముల కుమారులు. ప్రబంధాంకును నింటి పేరుగలవారు. రామరాజభూషణుడు పిన్నవయస్సున కృష్ణదేవరాయల యష్టదిగ్గజములలో నొకడు గనుండి భట్టుమూర్తి యను పేర పరగుచుండవని చాటు పద్య ములవలన తెలియుచున్నది. వీరిగ్గఱురు తమ గంధములలో తమ గ్రామము పేరు చెప్పి కొనియుండలేదు కాని వీరిది పల్నాడు లోని భట్టువారిపల్లెకావచ్చును. అందుల కాధారములు, (1) వీరి యింటి పేరు ప్రబంధాంకమువారు . భట్రాజు ప్రబంధాంకము వారిప్పటికి 30 సంవత్సరములవఱకు.