పుట:పల్నాటి చరిత్ర.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

24

పల్నాటి చరిత్ర

పిన్నెలిలోనివారు వృద్ధపరంపరగ చెప్పికొనెదరు. (4) పిన్నెలి ప్రాంతమును పూర్వము పింగళుడను రాక్షసుడేలినాడనియు అందువలన పింగళియను పేరువచ్చెననియు నచ్చటివారనెదరు. రాక్షస గుడులను పేర చిన్న గుడులు పిన్నెలివద్ద నిప్పటికిని యున్నవి. (5) కందుకూరి వీరేశలింగముగారు కవుల చరిత్రలో సూరనగారి గ్రామమగు పింగళి కృష్ణామండలమున నున్నదని వ్రాసినాడు. ఆకాలమున గుంటూరు కృష్ణజిల్లాలు కలిసి కృష్ణా మండలము (కృష్ణజిల్లా) గ నుండుటచే పింగళి గ్రామము పల్నాడులోని పిన్నెలి యగును. (6) సూరన హాస్యమునకై తెనాలి రామలింగనిమీద కం॥ తెన్నాలి రామలింగడు | తిన్నాడే తట్టెడంత యని వ్రాయగా రామలింగడు 'తీయని బెల్లం ! బెన్నగ దీనినివ్రాసిన | పింగళి సూరన్న నోట... (పేడే) పడెరా || యని పూర్తిచేసెనని చాటుపద్యముకలదు. ఈ పద్యము యొక్క నిజమెట్లున్నను, నిది చాలకాలమునుండి ప్రజలలో చెప్పుకొన బడుచున్నది. ఈ పద్యమునందు పింగళి సూరన్నకు బదులు పిన్నెలిసూరన యనిన ప్రాసభంగము గాకుండును. కావున పిన్నెలియే పింగళియగును. గట్టమంచి రామలింగా రెడ్డిగారు, తమకవిత్వ తత్త్వవిచారములో పింగళిసూరన కవిత్వమును ప్రశంసించిరి.

(2) రామరాజభూషణుడు (3) మూర్తికవి

వీరిద్దరు వేర్వేరు కవులు, భట్రాజులు పల్నాడుతాలూకా భట్రాజుపల్లె వీరిగ్రామము.