పుట:పల్నాటి చరిత్ర.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పల్నాటి చరిత్ర

27

భూపాలీయము) గద్యములో చెన్నబడిన వేంకటరాయభూషణుని కుమారుడగు మూర్తికవియు, వసుచరిత్ర, హరిశ్చంద్ర నలోపాఖ్యానముల గద్యములలో చెప్పబడిన సూరపరాజు కుమారుడు రామరాజభూషణుడును నొక్క రేయనియు కొంద నెదరు

(4) కాకునూరి అప్పకవి:- అప్పకవీయ మనబడు ఛందోగ్రంథమును రచించెను. ఆంధ్రమునగల ఛందోగ్రంథముల కెల్ల యప్పకవీయము ముఖ్యమైంది. అది క్రీ. శ. 1656–1660 మధ్య వ్రాయబడియుండునని కందుకూరి వీరేశలింగము గారు ఆంధ్రకవుల చరిత్రలో వ్రాసిరి. అప్పకవి బ్రాహ్మణుడు. వైదికుడు. నివాస స్థలము పల్నాడులోని కామేపల్లి. ఇప్పుడున్న కామేపల్లి కాదు. అప్పకవి కామేపల్లి శిధిలమైనది. బ్రాహ్మణపల్లి వద్ద అదియుండెడిది . అప్పకవి తన గ్రామములకు హద్దులను స్పష్టముగా వ్రాసినాడు. అప్పకవీయమందు మలయ వింధ్యాచల మధ్యమంబున గృష్ణ యామ్య తీరమున బ్రహ్మాశ్రమమున ||

గీ. దండకాటవి నాంధ్రాభిధానపుణ్య!
    దేశమున శ్రీగిరీశాన్యదిశను గొండ
    వీటి పడమర దంగెడ విషయమునకు |
    కామేపల్లిని గోపాలధామమునను
    
    గీ। పల్లెనాటనునూట తొంబదియునాల్గు
    గ్రామముల నీడు గానక కాకునూరి
    వేంగనార్యుడు వేదవేదాంగములను |
    ప్రస్తుతికి నెక్కెమాఱట బ్రహ్మయనగ
 

తన గ్రంధ మంకితమిచ్చిన కృష్ణు నిట్లు వర్ణించెను

కం॥ తంగెడసీమను నిర్జర గంగాసమ నాగ