పుట:పల్నాటి చరిత్ర.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చున్నది. 1939 లో ప్రారంభమైన రెండవ ప్రపంచయుద్ధము 1945 లో అంతమయ్యెను. 15–8_47 న మన దేశమునకు స్వాతంత్య్రము వచ్చెను. 1948 లో నైజాములో జరిగిన రజకార్ల యల్లరుల మూలమున చాలమంది నైజాము ప్రజలు పల్నాటిలో తలదాచుకొనిరి. 26-1-50న మనదేశము రిపబ్లిక్ ఆయెను. 1950 లో కమ్యూనిస్టులు యల్లరుల మూలమున పల్నాటి ప్రజలు బాధపడిరి. ఆహార వస్తువులమీదను, వస్త్రముల మీదను యుద్ధకాలమున పెట్టబడిన కంట్రోళ్లను స్వాతంత్య్రము వచ్చినను తీసివేయనందున ఇతర ప్రాంతములందలి ప్రజలతో బాటు పల్నాటిప్రజలు కూడ బాధ పడిరి. 1952లో కంట్రోళ్ళు తొలగింపబడెను. ఆ సంవత్సరమే గురజాలలో సెకండరిగ్రేడు ట్రయినింగుస్కూలు యేర్పడెను.

_________________


పల్నాటి కవులు

1. పింగళి సూరన:- పింగళి సూరన గరుడపురాణమును తెనిగించెను. రాఘవ పాండవీయమను శ్లేషకావ్యమును, కళాపూ ర్ణోదయమను నద్భుత కావ్యమును, ప్రభావతీ ప్రద్యుమ్నమును రచించెను. ఇతడు నియోగి బ్రాహ్మణుడు. గౌతమగోత్రుడు . 16వ శతాబ్దమువాడు, ఇతడు క్రీ.శ 1566వ సంవత్సర ప్రాంతయిన నుండెనని కందుకూరి వీరేశలింగముగారు నిర్ధారణ చేసిరి కృష్ణదేవరాయలు (1509 -1530) వఱకు రాజ్యమేలెను.