పుట:పల్నాటి చరిత్ర.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

20

పల్నాటి చరిత్ర

ప్రాంతమున మునసబు కోర్టు కారెమపూడినుండి నరసరావుపేటకు మార్చబడెను. గుఱ్ఱపుబండ్లు అంచెలుగా నేర్పడి వాని మీద ప్రయాణములు చేయుచుండిరి. ఇప్పటికి 50 సంవత్సర ముక్రింద దైదవద్ద కృష్ణానదికి ఆనకట్ట కట్టవలయునను నుద్దేశ్యముతో సర్కారువారు యీతాలూకాను కొలిపించి ప్లానులు తయారుచేయించిరి. కృష్ణవద్ద నొక బంగళానుకట్టిరి తరువాత నాప్రాజెక్టును మానుకొనిరి. ఆ బంగళా యిప్పటికిని యున్నది. 1915 ప్రాంతమున మోటారు బస్సు సర్వీసు యేర్పడెను. 1920 లో అసహాయోద్యమ సందర్భమున ప్రభుత్వ సైనికులచే జంగమహేశ్వరపురము, పొందుగుల, రామాపురం మొదలగు: చోట్ల నల్లరులు జరిగెను. పుల్లరిని కట్టవద్దని ప్రచారము చేసిన కన్నెగంటి హనుమంతు యనునతడు మించాలపాడువద్ద కాల్చబడెను. 3-1-1927 న గురజాలలో మునసబుకోర్టు యేర్పడెను. 1928 లో నాగార్జునకొండ విషయము బయలు పడెను. 1929 లో పల్నాటికి రైలుమార్గమేర్పడెను. 1937లో గోపన్న యానునతనిచే గురజాలలో మూడున్నర రూపాయలకు 15 రోజులలో నాలుగురూపాయ లిచ్చునట్లు కంపెనియేర్పడి ముప్పదిలక్షల రూపాయలవఱకు వ్యాపారము చేసి ప్రజలను నష్టపఱచెను. పల్నాటికి మొదటి హైస్కూలు గురజాలలో నేర్పడెను. దరిమిలా చాలగ్రామములందు హైస్కూళ్ల నేర్పచిరి. 1937 లో కావూరి వెంకయ్య గారిచే గురజాల హరిజన వసతి గృహమేర్పడెన. అది దినదినాభివృద్ధి