పుట:పల్నాటి చరిత్ర.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పల్నాటి చరిత్ర

19

కృష్ణనుదాటి నైజామునుండి వేయిమంది సిపాయులు బందిపోటు దొంగలుగా వచ్చి కంపెనివారి సైన్యమును చంపి దేశమును దోచుకొనిరి. వినుకొండనుండి కంపెని వారి సైన్యము వచ్చి వారిని పాఱదోలెను. 1801 లో ఆర్కాటునవాబు పల్నాటిని కంపెనివారికి చ్చెను. 31-7-1801 (scot) స్కాటు యనునతడు కలెక్టరాయెను. 1816 లో పిండారీలు అమరా పతివద్ద కృష్ణనుదాటి దేశమును కొల్లగొట్టుచు గుంటూరు నరసరావుపేట వినుకొండ మీదుగా కంభముకు పోయిరి. గుంటూరిని పిండారీలు దోచుకొనిరి. పిండారీలలోని యొక గుంపును నరసరావుపేటజమీందారుడగు గుండారాయుడు కోట ప్పకొండవద్ద జయించెను. 1832-33 (నందన) సంవత్సరమందు గుంటూరు కృష్ణాజిల్లాలకు పెద్దకఱవువచ్చెను. దానిని డొక్కలకఱవందురు. అప్పుడు రైలుమార్గములు లేనందున గోదా వరి ప్రాంతము పండినను ఆ ధాన్యమిచ్చటకు వచ్చుటకు వీలు లేక కఱవుచే ప్రజలు బాధపడిరి. 1859 డిశంబరు లో గుంటూరు మచిలీపట్టణము జిల్లాలను కలిపి కృష్ణాజిల్లాగ చేర్చిరి. దరిమిలా గుంటూరు కృష్ణాజిల్లాలు వేఱయ్యెను. ధాత కఱవు (1876) లో ప్రజలు బాధపడిరి. తహసీలుదారు ఆఫీసు దాచేపల్లి నుండి గురజాలకు మార్చబడెను. కారెమపూడిలో పల్నాడు వినుకొండ నరసరావుపేట తాలూకాలకు నొక మునసబుకోర్టుండెను. దానిపై యప్పీలు చేయుటకు బందరులో జడ్జికోర్టు ఉండెను. యూరపియనులు డిస్ట్రక్టు మునసబులుగను జడ్జిలుగనుండిరి. వైటుదొర (white) డిస్ట్రక్టమునసబుగా నుండినప్పుడు 1895