పుట:పల్నాటి చరిత్ర.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

18

పల్నాటి చరిత్ర

భద్రయ్యను తొలగించెను. అప్పుడు పల్నాడు ఉత్తరసర్కారులలో లేదు. పల్నాడు, ఒంగోలు తాలూకాలు తప్ప మిగిలిన గుంటూరుజిల్లా మాత్రమే యుత్తరసర్కారులలో నుండెను. ఒంగోలు నెల్లూరితో బాటు పల్నాడు ఆర్కాటునవాబు క్రింద నుండెను. ఆర్కాటునవాబు తన రాజ్యమును కొన్ని భాగములుగ విభజించి తనకు రావలసినశిస్తును తనసభలో ప్రతిసంవత్సరము వేలము వేయుచుండెను. ఎక్కువ పాట పెట్టినవాడు పాట మొత్తమును నవాబుకు చెల్లించి పాట పెట్టిన గ్రామములలోని ప్రజలనుండి శిస్తు వసూలు చేసికొనుచుండెను. తుమృకోడులో కొంత సైన్యముతోబాటు నొక ఫౌజుదారుని నెలకొల్పెను. 1766 నుండి ఈస్టు ఇండియాకంపెని వారి సైన్యము కూడ కొంత తుమృకోడులో నుండెను. తుమ్పకోడులో చనిపోయిన ఆంగ్లేయ సైనికోద్యోగుల సమాధులలో ఆర్కాటునవాబగు (క్లైవుకాలమందలి) మహమ్మదాలిపేరు నమోదు కాబడినది. 24-2-1787 న యితర జిల్లాలతో బాటు పల్నాటినికూడ నవాబు కంపెనివారికి తాకట్టు పెట్టెను. 1790 జులై నెలలో కంపెనివారి పాలన ప్రారంభమయ్యెను.

ఆంగ్లేయుల పరిపాలన

పల్నాటికిని ఒంగోలునకుకు కలిపి (Erskine) యిర్శికిన్ యనునతని కలెక్టరుగా కంపెనివారు నియమించిరి. తుమృకోడులో నొక డిప్యూటి తహసీలుదారు డుండెను. 1793 లో