పుట:పల్నాటి చరిత్ర.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పల్నాటి చరిత్ర

17

పెందోటయను పట్టణముండెను. దానిని ధవళేశ్వరపు మార్కండేయుడను విశ్వబ్రాహ్మణప్రభువు పాలించెను. ఇతడు 1585 A. D. ప్రాంతమున నుండెను. అప్పుడు గోల్కొండను పాలిం చుచున్న మహమ్మద్ కుతుబుర శాహికి మంత్రియై, సామంతుడై యతని రాజ్యవిస్తరణకు తోడ్పడెను. కుతుబురశాహి కీ. శ. 1580 నుండి 1611 వఱకు పాలించెను. తుర్కా రాజు కవి, అయ్యంకి బాలసరస్వతి యను నిరువున కవుల పోషించి ఈ మార్కండేయ ప్రభువు స్కాందపురాణములోని నాగర ఖండమును వారిచే తెలుగు చేయించి కృతినొందెను.క్రీ.శ. 1660 ప్రాంతమున నుండిన అప్పకవి తన గ్రామమగు కామేపల్లి సాయప వేంకటపతి భూనాయకునిచే నీయబడినదని వ్రాసికొనెను. అప్పకవి కాలములో పల్నాటిలో 194 గ్రామము లుండెనని ‘పల్లెనాటను నూట తొంబదియునాల్గు గ్రామముల' అను అప్పకవీయములోని పద్యమువలన తెలియుచున్నది. (కొండవీటి రెడ్లకాలమున 150 గ్రామములున్నట్లు తెలియుచున్నది. ఇప్పుడు శివారుతో కలిపి 133 గ్రామము exన్నవి.) గోల్కొండనవాబు పిమ్మట పల్నాడు ఆర్కాటు నవాబు క్రిందికివచ్చెను, 18వ శతాబ్దం ప్రారంభమున రామరాజు మంత్రప్ప దేశాయి యనునతడు పల్నాటికి దేశముఖుడు (దేశ వ్యవహర్త) యయ్యెను. అతని మనుమడు వీరభద్రయ్య వరుసగా 34 సంవత్సరములు పల్నాటికి దేశముఖుడుగా నుండెను. ఆర్కాటునవాబగు మహమ్మద్ ఖాన్ క్రీ. శ. 1764 లో వీర