పుట:పల్నాటి చరిత్ర.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

16

పల్నాటి చరిత్ర

తిమ్మానాయనింగారి భార్య లింగాంబ తనపేర లింగాపురమను గ్రామము కట్టించి వీరభద్రస్వామికి సమర్పించి నట్లున్నది. ఈ దానశాసనము ననుసరించి యిప్పటికిని యీలింగాపురము వీరభద్రస్వామివారి కైంకర్యమునకు వినియోగ పడుచున్నది.

సదాశివరాయలు క్రీ. శ. 1542-1568 వఱకు పాలిం చెను, ఆకాలమున మాచర్ల ప్రాంతము నాగార్జున కొండసీమ యని వ్యవహరింపబడుచుండెననియు, దానికి తిమ్మానాయనింగారను వాడు రాష్ట్రపాలకుడుగా నుండెననియు తెలియుచున్నది. గురజాలలో వీరభద్రస్వామి యాలయములో నాగుపాములు చిత్రింపబడిన రాతి స్తంభపు శాసనముమీద తిరుమల దేవరా యనికాలపు శాసనమున్నది. కాబట్టి క్రీస్తుకు పూర్వము రెండు పిమ్మట రెండు శతాబ్దములందు ఆంధ్రరాజులు, 3 వ శతాబ్ద మున ఇక్ష్వాకులు, 4, 5, 6, 7, 8, శతాబ్దములందు పల్లవులు, 9, 10 శతాబ్దములంగు చోళులు, 11వ శతాబ్దమున చాళుక్యులు వెలనాటిచోళులు, 12 వ శతాబ్దమున పల్నాటి వీరులు పద్మనాయకులు, 13, 14, శతాబ్దములందు కాకతీయ రాజులు, 14, 15 శతాబ్దములంకు కొండవీటి రెడ్డిరాజులు, 16 వ శతా బమునందు విజయనగర ప్రభువులు పాలించిరి.

మహమ్మదీయపాలన

విజయనగర సామ్రాజ్య మంతరించగనే పల్నాడు క్రీ. శ. 1565 ప్రాంతమున గోల్కొండనవాబు వశమయ్యెను. నాగార్జునకొండకు పదిమైళ్లు దక్షిణముగా కృష్ణాతీరమున {