పుట:పల్నాటి చరిత్ర.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పల్నాటి చరిత్ర

15

హరించె | గూటముల్ సెదరంగ కొండవీడగలించె | బెల్లము కొండ యచ్చెల్ల జెఱచె" నని పల్నాటినానుకొనియున్న వినుకొండ బెల్లముకొండ దుర్గములను కృష్ణదేవరాయలు గెలిచెనని వర్ణించెను. కృష్ణ దేవరాయని శాసనములు శ. క. 1440 (1518 A. D.) పట్లవీడులోను కలవు. పట్లవీడు శివారు రామడక అను గ్రామమును మాచర్ల చెన్న కేశవస్వామివారికి సమర్పించినట్లు పట్లవీటి శాసనములో మన్నది, అనగా రాయలస్వాధీనమైన రెండు సంవత్సరముల కీదానము జరిగినది. ధరణికోట శాసనములో అద్దంకి , వినుకొండ. బెల్లము కొండ, నాగార్జునకొండ, తంగెడ, కేతవరము, మొదలగు దుర్గములను రాయలు గెలిచెనని కలదు. అహోబల శాసనములో వినుకొండ, బెల్లముకొండ, నాగార్జునకొండ, అద్దంకి, అమ్మన బ్రోలు, తంగెడ, కేతవరము మొదలగు దుర్గముల రాయలు గెలిచెననికలదు. కృష్ణ దేవరాయల పాలనమునందు క్రీ.శ. 1518న నతని రాష్ట్రపాలకుడగు యల్లవినాయంకరు మకృకాతిమ్మరు నాయంకరు పాలనముక్రింద పల్నాడుండినట్లు పట్లవీటి శాసనము వలన తెలియుచున్నది. క్రీ.శ. 1526 యందు కృష్ణదేవరా యలరాష్ట్రపాలకుడగుకోనపనాయనింగారిక్రిందపల్నాడుండినట్లు మాచర్ల శాసనమువలన తెలియుచున్నది. మాచర్ల వీరభద్రా లయములోని యెఱ్ఱబండ శాసనమునందు సదాశివ రాయలు విజయనగర సామ్రాజ్యము పాలించుచుండగా ఆ సామ్రాజ్యము నకు లోబడి నాగార్జున గుకొండ సీమను పాలించు ప్రభువగు