పుట:పల్నాటి చరిత్ర.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

14

పల్నాటి చరిత్ర

ఇతనినిబట్టియే మహదేవి చెర్వు పట్టణమునకు మాచెర్లయని పేరువచ్చియుండవచ్చును. తంగెడకోటను ఉప్పల అనుములు మాచిరెడ్డి యనుగతడు కట్టించినట్లు తెలియుచున్నది.

కాకతీయులపిమ్మట కొండవీటి రెడ్డిరాజుల క్రిందకు పల్నాడువచ్చెను. కొండవీటి రెడ్డిరాజులు ఒరిస్సాకు ప్రభువు లగు గజపతులకు సామంతులుగ నుండిరి. కొండవీటి రాజ్యమునగల 14 సీమలలో పల్నాటిసీమ యొకటి. పల్నాటిసీమలో గురజాలసముతు మాచర్ల సముతు తుమురుకోడు సముతు తంగెడసముతు కారెంపూడి సముతు యని యైదుసముతులుండెను. దాచేపల్లిలోని పాడుపడినకోట కొండవీటి రెడ్డిరాజులచే గట్టబడినది. కొండవీటి చరిత్రము కొండవీటి దండకవిలె వలనను, మద్దులపల్లి గురుబ్రహ్మశర్మగారు వ్రాసిన కొండవీటిసామ్రాజ్యమను గ్రంధమువలనను తెలియనగును. కొండవీటి రెడ్ల యాస్తానకవి యగు శ్రీనాధుడు పల్నాటిలో ననేకపర్యాయములు తిరిగి మనోహరములగు పద్యములు చెప్పెను. పల్నాటి వీరగాధను ద్విపదకావ్యముగా రచించెను. అనగా యుద్ధము జరిగిన 300 సంవత్సరములకు మొదటితూరి (ద్విపదగా) వీరగాధ రచింపబడెను. కొండవీటిని కృష్ణదేవరాయలు క్రీ. శ. 1516 లో గెలిచెను. అప్పుడు పల్నాడుకూడ విజయనగర సామ్రాజ్యము లోనికి వచ్చెను.

విజయనగర రాజుల పాలన

పారిజాతాపహరణము నందు నంది తిమ్మన "సీ. ఉదయాద్రివేగ నత్యుద్ధతిసాధించె | వినుకొండమాట మాత్రన