పుట:పల్నాటి చరిత్ర.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పల్నాటి చరిత్ర

13

అతనికుమార్తెయగు రుద్రమదేవి కాకతీయ రాజ్యమేలెను. ఆరాణి కాలమున యామెరాష్ట్రపాలకుడగు జన్నిగదేవరాజు క్రింద పల్నాడుండెను. ఈజన్నిగదేవరాజు సాహిణి గంగ య్యకు మేనల్లుడు. ఈజన్నిగదేవునికాలమున కారెంపూడి లోని సురేశ్వరాలయమునకు గోపుర ప్రాకారములు కట్టబడినవి. దుర్గి లోని శ.క. 1191 (1269 A.D) శాసనములోను కారెంపూడి శ॥క ॥ 1186 (1264 AD) శాసనములోను జన్నిగదేవరాయనిపేరు పేర్కొనబడినది. జన్నిగదేవరాయల పిమ్మట త్రిపురాంతకదేవుడు రాష్ట్రపాలకుడుగా నుండెను. అతని క్రింద పల్నాడుండెను . దాచేపల్లిలోని శ.శ. 1135 (1213 A. D.) నాటి శాసనమునందు త్రిపురాంతక దేవుని పేరు చెప్పబడినది. రుద్రమదేవి పిమ్మట నామె మనుమడగు రెండవ ప్రతాపరుద్రుడు వరంగల్లునకు ప్రభువ య్యెను. అతనికాలముననే కాకతీయ రాజ్య మంతరించెను. అతనికి మంత్రి ప్రసిద్ధిచెందిన యుగంధరుడు. అతనికాలమున నతని రాష్ట్రపాలకుడును మంత్రియునగు సాహిణి మాచయ సేనాని క్రింద పల్నాడుండెను. ఇతడు క్రీ శ. 1311 సంవత్సరమున గురజాల, పింగళి స్తలములు చేరియున్న పలినాటి సీమ కధికారియని కోన వెంకటరాయశర్మగారు వ్రాసిన దండనాధులను పుస్తకములో నున్నది. ఇతను మహదేవి చెర్వు పట్టణము (మాచర్ల) నేలుచుండినట్లు మాచర్లలోని శ. క. 1236 (1314 A. D) నాటి శాసనములోనున్నది. ఇతని పేరు శ.క.1229 (1307 A. D) నాటి కారెమ పూడి శాసనములోగూడ నున్నది.