పుట:పల్నాటి చరిత్ర.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

12

పల్నాటి చరిత్ర

పశువుల విషయమై యాపదలు వచ్చినప్పుడీ గుడులకు మ్రొక్కుకొందురు.) మనుమసిద్ధిరాజుయుద్ధమునందోడెన కాటమరాజు నెల్లూరి నాక్రమించెను.మనుమసిద్ధిరాజుకు మంత్రియు నాస్తానకవియునగు తిక్కన సోమయాజి వరంగల్లునకు బోయెను. కాకతీయ చక్రవర్తియు మొదటి ప్రతాప రుద్రుని కుమారుడునగు గణపతిదేవుడు అప్పుడు వరంగల్లు నేలు చుండెను. గణపతి దేవునివద్దగల బౌద్ధులను జైనులను తిక్కవ సోమయాజి వాదమునందు గెలిచి గణపతి దేవుని మెప్పుపొందెను. తిక్కనకోరికపై మనుమసిద్ధిరాజు సహాయమునికై గణపతి సైన్యమును బంపెను. కాటమరాజు నెల్లూరివిడచి పారి పోయెను. మనుమసిద్ధిరాజు నెల్లూరికి ప్రభువయ్యెను. పల్నాడు కాకతీయ సామ్రాజ్యములోనికి వచ్చెను. అనగా పల్నాటియుద్ధము జరిగిన 50 సంవత్సరము లకు పల్నాడు గణపతి దేవుని క్రిందకు వచ్చెను.

కాకతీయుల పాలన

కాకతీయుల కాలమునాటి దానశాసనములు పల్నాటిలో చాలగలవు శాసనములందు, శాలివాహన శకమే కాకుండ కాకతీయ చక్రవర్తుల పేరులు సహితము పేర్కొన బడినవి. మాచర్లరోడ్డు వంతెనవెంబడి చంద్రవంక యొడ్డున పాడుపడిన గుడివద్దనున్న శాసన మట్టివానిలో నొకటి. గణపతి దేవుడు క్రీ॥ శ॥ 1260 వఱకు రాజ్యమేలెను. అతని కాలమున నతనిమంత్రులలో నొకడు రాష్ట్ర పాలకులలో నొకడునగు సాహిణి గంగయ్యక్రింద పల్నాడుండెను. గణపతిదేవు ని పిమ్మట