పుట:పల్నాటి చరిత్ర.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పల్నాటి చరిత్ర

11

వరంగల్లు నేలుచున్న కాకతీయ ప్రభువగు మొదటి ప్రతావ రుద్రుడు నలగాముని సహాయార్థము1000 గుఱ్ఱపు సైన్యమును బంపెనని పల్నాటి వీర చరిత్రలోకలదు. నాయకురాలు సంధికై బ్రహ్మనాయనివద్దకు పంపిన రాయబారి కోటకేతుడు ధరణికోటరాజు. ఇతడు శక 1104 (1182 A.D) లో రాజ్యమునకు వచ్చినట్లు అమరావతి శాసనములో నున్నది. నలగాముడు సహాయము కొఱకుత్తరములు పంపినవారిలో (రెండవ) వీరభల్లాణుడు కలడు. ఇతడు ద్వారసముద్రము రాజధానిగా క్రీ. శ. 1173 మొదలు 1221 వఱకు రాజ్యమేలెను. వీర చరిత్రలో వెలనాటి చోడుడు కూడ నుదహరింపబడినాడు. ఇతని యసలు పేరు రాజేంద్రచోడు డైనట్లును క్రీ.శ. 1158 మొదలు 1200 వఱకు పాలించినట్లను తెలియుచున్నది. అలుగురాజు నలగామరాజుల కాలములో ననేక చోట్ల చెరువులు త్రవ్వబడినవి. ఆలయములు బాగు చేయబడినవి. మాచర్ల చెన్నకేశవాలయమును బ్రహ్మనాయుడు బాగుచేసి పెంపుచేసెను. పల్నాటివీరుల పిమ్మట యనగా 13వ శతాబ్దమున పల్నాటిని పద్మనాయకులు పాలించిరి. కనిగిరిసీమ ప్రభువగు కాటమరాజునకును నెల్లూరి ప్రభువగు మనుమసిద్ధి రాజునకును పశువుల పుల్లరివిషయమై యుద్ధముజూగేరు. ఖడ్గ తిక్కన మనుమసిద్ధిరాజువద్ద సేనానిగానుండెను. పల్నాటి పద్మనాయకులు కాటమరాజునకు యుద్ధమునందు సహాయము చేసిరి. (కాటమరాజు గుడులచ్చ టచ్చట ప ల్నాటిలోకలవు,