పుట:పల్నాటి చరిత్ర.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

10

పల్నాటి చరిత్ర

మైళ్ల దూరముననుండు ధరణికోట (ధాన్యకటకము) ముఖ్య పట్టణములుగా నుండెను. మూడవశతాబ్దములో నిక్ష్వాకులు పాలించిరి. ఇక్ష్వాకుల నాణేములు కొన్ని నాగార్జున కొండలో దొరకినవి. అటుపిమ్మట పల్లవులు పాలించిరి. పల్లవుల పిమ్మట చోళులు పల్నాటిని పాలించిరి. గురజాలలోని యిష్టకామేశ్వరాలయము చోళులకాలమునాటిదని ప్రతీతి. కొన్ని శాసనములలోని ప్రభువుల పేర్లలో కన్నడపు పేరులు గాన్పించుటచే కన్నడ దేశపు రాజులు చోళులపిమ్మట పల్నాటి నేలినట్లు తెలియుచున్నది. ఆపిమ్మట చాళుక్యులు పాలించిరి. చాళుక్యప్రభువులలో చాలమందికి పేరులచివర ఆదిత్యుడని యుండును. (విజయాదిత్యుడు, గుణగాదిత్యుడు, విమలాదిత్యుడు మొద లగునవి.) అట్టి ఆదిత్యులలో నొకనివలన మాచర్లలోని యాది త్యేశ్వరాలయము నిర్మింపబడినది. అది శివాలయము, ఆదిత్య నిర్మిత దేవప్రాసాదమని శాసనములోనున్నది. దానికి చాగి బేతరాజు అను ప్రభువు క్రీ॥శ॥ 1111 లో భూదానము చేసెను. అటుపిమ్మట వెలనాటి ప్రభువు ధవళశంఖుని క్రింద పల్నాడుం డెను, వానికి చందవోలు ముఖ్యపట్టణము. అతడుతన కూతురు నకు పల్నాటి నరణముగా వివాహవేళనిచ్చెను. అంతటనుండి పల్నాటివీరులు పాలించిరి. వీరు హైహయవంశజులు. వీరిని గళచురి రాజులందురు. రేవా (నర్మదానది) ప్రాంత మునగల పాలమాచాపురి (జబల్పూరు) నుండివచ్చిరి. వీరిలోపల్నాటి నేలినది అలుగురాజు, నలగామరాజు మలిదేవాదులు, పల్నాటి యుద్ధము క్రీ॥శ॥ 1180 ప్రాంతమున జరిగెను, ఆకాలమున